లైంగిక వేధింపుల కేసులో నలుగురి సస్పెన్షన్
x

లైంగిక వేధింపుల కేసులో నలుగురి సస్పెన్షన్

రంగరాయ వైద్య కళాశాల ఘటనలో అధికారుల సత్వర చర్యలు


రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థినులకు లైంగిక వేధింపుల ఘటనలో బాధ్యులుగా నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్‌ తెలిపారు.ల్యాబ్‌ అటెండెంట్‌ కల్యాణ్ చక్రవర్తితో పాటు టెక్నీషియన్లు జిమ్మి రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చామన్నారు..ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌తో కలిసి కలెక్టర్‌ మీడియా సమావేశం నిర్వహించారు.వేధింపులపై మెయిల్‌ పంపిన విద్యార్థినిని కలెక్టర్ అభినందించారు.

కళాశాలలో గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయా? అనే కోణంలోనూ పోలీసుల విచారిస్తున్నారు.ఈ ఘటనపై శుక్రవారం ఉదయం నుంచి మూడు ఫిర్యాదులు అందాయని ఎస్పీ బిందుమాధవ్‌ తెలిపారు. వన్‌టౌన్‌ పీఎస్‌లో 2, టూటౌన్‌లో ఒక ఫిర్యాదు వచ్చిందన్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.మెడికల్ కాలేజీలో వేధింపుల పర్వం వెలుగు చూసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More
Next Story