భారీ వర్షాలకు ఉత్తరాంధ్రలో నలుగురు మృతి–4లక్షలు నష్టపరిహారం
x

భారీ వర్షాలకు ఉత్తరాంధ్రలో నలుగురు మృతి–4లక్షలు నష్టపరిహారం

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా భారీ వర్షాల మీద సీఎం చంద్రబాబు సమీక్షించారు.


ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు, వాటి వల్ల సంభివించిన ప్రమాదాల కారణంగా నలుగురు మృతి చెందినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. విశాఖ నగరం కంచరపాలెం లో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఒకరు మరణించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. వరదలు, వర్షాలు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గొట్టా బ్యారేజ్‌ క్యాచ్‌ మెంట్లో 33 టీఎంసీలు, తోటపల్లి పరిధిలో 11 టీఎంసీలు మేర వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు సీఎంకు వివరించారు. గొట్టా బ్యారేజికి 1.89 లక్షల క్యూసెక్కులు, తోటపల్లికి 44 వేల క్యూసెక్కుల వరద వస్తోందని శ్రీకాకుళం కలెక్టర్‌ సీఎంకు తెలిపారు. ఒడిస్సాల్లోని ప్రాంతాల్లో పడిన భారీ వర్షాల కారణంగా వంశధారకు 1.05 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు వివరించారు.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షం లేదని, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహాలతో నదుల్లో వరద ఉందని, భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల చెట్లు కూలాయని, ఇప్పటికే 90 శాతం కూలిన చెట్లను తొలగించామని చెప్పిన సీఎంకు అధికారులు వివరించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు 90 శాతం మేర విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించినట్టు వెల్లడించిన ఈపీడీసీఎల్‌ అధికారులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం లోగా అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్‌ పునరుద్ధరించాలని, విద్యుత్‌ సరఫరా పునరుద్దరణలో ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Read More
Next Story