మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు 14 రోజులు రిమాండ్‌
x

మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు 14 రోజులు రిమాండ్‌

మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు 14 రోజులు రిమాండ్‌ విధించారు. ఈ నెల 17 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ మంగళగిరి కోర్టు తీర్పు చెప్పింది. గత జగన్‌ ప్రభుత్వంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. 2021, అక్టోబరు 19న ఈ ఘటన చోటు చేసుకుంది. పార్టీ కార్యాలయ అద్దాలు, ఫర్నిచర్, కార్లు ధ్వంసం అయ్యాయి. దీనిపై అప్పుడే మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. అయితే వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఉండటంతో కేసు ముందుకు సాగ లేదు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును తెరపైకి తెచ్చింది. ఈ దాడిలో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ పాత్ర ఉందని అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీ, వీడియోల ఆధారంగా కొంత మందిని గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.

Read More
Next Story