
మాజీ సీఎంలకు ఇంటిపోరు
‘‘ఇంటిలోని పోరు ఇంతింత కాదయా... విశ్వదాభిరామ వినుర వేమ’’.. అన్నాడు కవి వేమన. ఎందుకు అన్నాడో తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలను చూస్తే అర్థం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం కే చంద్రశేఖర రావు (కేసీఆర్) ఇద్దరూ రాజకీయ రంగంలో దిగ్గజాలు. అధికారంలో ఉన్నప్పుడు వారి మధ్య ఉన్న బాండింగ్ చూస్తే, ఎవరైనా అసూయపడడాల్సిదే. ఐదేళ్ల పాలనలో ఒక్క వివాదం కూడా లేదు! షర్మిల తెలంగాణలో వైయస్సార్‌టీపీ పార్టీతో పోరాడుతున్నప్పుడు కూడా జగన్ కేసీఆర్‌కు వివరించి, స్నేహాన్ని కాపాడుకున్నారు. కానీ ఇంట్లో విషయం వేరు. ఇద్దరూ తమ కుటుంబ సభ్యులను దూరం చేసుకుని, రాజకీయంగా ఏమి సాధించారు? ఇంటిని చక్కబెట్టుకోలేని వారు రాష్ట్రాన్ని ఎలా చక్కబెట్టగలరు? అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
రాజకీయంలో ఇంటి పోరు
ఊహించుకోండి.. ఇద్దరు పెద్దమనుషులు. జగనన్న, కేసీఆర్ అన్న. వీరిద్దరూ చెరో రాష్ట్రానికి గతంలో ముఖ్య మంత్రులు. రాష్ట్రాల మధ్య సరిహద్దు తగాదాలు, నీటి పంచాయితీలు ఉన్నా, వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. "ఏమైంది బ్రదర్? షర్మిల ఇక్కడ పార్టీ పెట్టి మనల్ని తిట్టింది?" అంటే జగనన్న చెప్పేవాడు.. "అది ఫ్యామిలీ మ్యాటర్ బ్రదర్, డోంట్ వర్రీ!" అంటూ కేసీఆర్ అన్నను హగ్ చేసుకునేవాడు. ఐదేళ్లు గడిచాయి, ఒక్క గొడవ కూడా లేదు. స్నేహం అంటే ఇదేనేమో!
ఇంట్లో సీన్ రివర్స్
కానీ ఇంటికి వచ్చేసరికి సీన్ రివర్స్. జగన్ ఇంట్లో తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో "ఆస్తి వారసత్వ యుద్ధం". సరస్వతి పవర్ షేర్లు, అవి ఎవరివి? జగన్ NCLTకు వెళ్లి, "ఇది అక్రమ ట్రాన్స్‌ఫర్" అని పిటిషన్ పెట్టాడు. 2025 జులైలో విక్టరీ! షేర్లు తిరిగి జగన్ వైపు. కానీ తల్లి విజయమ్మ 2024 అక్టోబర్‌లో లెటర్ రాసి, "షర్మిలను అన్యాయం చేస్తున్నావు కొడుకా, తండ్రి మాట గౌరవించు" అంది. షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, రోజూ అన్నను విమర్శిస్తోంది. "అన్నా, ఆస్తి తగాదాలు మాత్రమే కాదు, నువ్వు మా తండ్రి ఆశయాలను మరచిపోయావు!" అంటూ ఘాటు వ్యాఖ్యలు. జగన్ రాష్ట్రాన్ని పాలించినప్పుడు "నవరత్నాలు" ఇచ్చాడు. కానీ ఇంట్లో "నవ తగాదాలు" సృష్టించాడు. ఏమి సాధించాడు? రాజకీయంగా ఒంటరి, కుటుంబంగా విడిపోయాడు. ఇంటి మనుషులను దూరం చేసుకుని, ఎనిమీలను పెంచుకున్నాడు!
కేసీఆర్ ఇంట్లో పవర్ స్ట్రగుల్
ఇక కేసీఆర్‌న్నా ఇంటి స్టోరీ.. మరింత డ్రామాటిక్! కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావు, సంతోష్ రావు మధ్య "పవర్ స్ట్రగుల్". 2025 సెప్టెంబర్ 2న కేసీఆర్ కవితను BRS నుంచి సస్పెండ్ చేశాడు. "యాంటీ పార్టీ యాక్టివిటీస్" అని రీజన్. కవిత వెంటనే MLC పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, "తెలంగాణ జాగృతి"నా సంస్థ అంటూ ఆ కార్యాలయం నుంచి విలేకరులతో మాట్లాడారు. "హరీష్, సంతోష్ నాన్నను మోసం చేస్తున్నారు. కుట్రలు పన్నుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్లను ఉపయోగించి మా ఫ్యామిలీని చీల్చుతున్నాడు!" అని చెప్పారు. కవిత తండ్రిని నిందించకపోయినా, "తప్పు చేస్తున్నాడు" అని స్పష్టం చేసింది. కేసీఆర్ తెలంగాణ సాధించాడు, కానీ ఇంటి "సమైక్యత" సాధించలేకపోయాడు. కూతురు "జాగృతి" ప్రకటిస్తుంటే, పార్టీలో "అజాగ్రత" పెరిగింది. ఏమి సాధించాడు? పార్టీలో చీలికలు, కుటుంబంలో కలహాలు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు పెద్దలు. కానీ కేసీఆర్ ఇంట్లోనే రచ్చ చేసుకున్నాడు!
ఏమి సాధించారు? ఏమి కోల్పోయారు?
ఇద్దరు మాజీ సీఎంలు "ఫ్యామిలీ ఫ్యూడ్" గేమ్ ఆడుతున్నట్లు. జగన్ ఆస్తి తగాదాలతో చెల్లిని, తల్లిని దూరం చేసుకుని, రాజకీయంగా ఒంటరిగా మిగిలాడు. షర్మిల కాంగ్రెస్‌లో ఉండి, అన్నను విమర్శిస్తూ ఉంది. ఫలితం YSR ఫ్యామిలీ డివైడెడ్, పార్టీ వీక్.
కేసీఆర్ కూతురిని సస్పెండ్ చేసి, పార్టీలో అంతర్గత కలహాలు పెంచాడు. కవిత "జాగృతి"తో ప్రజలను చైతన్యం చేస్తానంటోంది. కానీ ముందు ఫ్యామిలీని చైతన్యం చేయాల్సింది!
స్నేహితుల మధ్య అంత సఖ్యత ఉంటే, కుటుంబంలో ఎందుకు కుతంత్రం? అధికారం కోసం ఫ్యామిలీని త్యాగం చేస్తే, అధికారం పోయిన తర్వాత ఏమి మిగులుతుంది? "ఇంటిని చక్కబెట్టుకోలేని వారు రాష్ట్రాన్ని ఎలా?" అని. సాధించింది ఏమీ లేదు. కోల్పోయింది చాలా! ఫ్యామిలీ ఫస్ట్, పవర్ సెకండ్. లేకపోతే ఇంటి పోరు మాత్రమే మిగులుతుంది!