నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలకు ఆకస్మిక వరదలు?
x

నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలకు ఆకస్మిక వరదలు?

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్‌ ఫ్లడ్‌) సంభవించే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


ప్రస్తుతం నెలకొన్న వాతారణ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు(ఫ్లాష్‌ ఫ్లడ్స్‌) సంభవించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ చెప్పారు.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి 280కిమీ, పుదుచ్చేరికి 320కిమీ, నెల్లూరుకి 370కిమీ మధ్య దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా 15కిమీ వేగంతో ఈ వాయుగుండం కదులుతున్నది. దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్‌ ఫ్లడ్‌) సంభవించే అవకాశం ఉందని తెలిపారు.

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెన్నా నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యల కోసం జిల్లాల్లో 5 ఎస్డీఆర్‌ఎఫ్, 2 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని స్థానిక అధికారులకు సలహా ఇచ్చారు.
Read More
Next Story