
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు
‘దిత్వా’ తుపాన్ ప్రభావం వల్ల నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రవాయుగుండం ‘దిత్వా’ ప్రభావం కొనసాగుతోంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా కొనసాగుతున్న దిత్వా, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఉత్తర-వాయువ్య దిశగా కదులుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, సోమవారం మధ్యాహ్నం నాటికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. అయితే, దక్షిణకోస్తా తీరం వెంబడి 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మంగళవారం (డిసెంబర్ 2) వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
Next Story

