పిఠాపురంలో రోడ్డెక్కిన మత్స్యకారులు
x

పిఠాపురంలో రోడ్డెక్కిన మత్స్యకారులు

తీరప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు సముద్రంలోకి వదులుతున్న వ్యర్థాల కారణంగా మత్స్య సంపద నశించిపోతుందని ఆందోళనలకు దిగారు.


ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నియోజక వర్గమైన పిఠాపురం పరిధిలోని యూ కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామానికి చెందిన మత్స్యకారులు రోడ్డెక్కారు. ఈ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు, ఓఎన్‌జీసీ వల్ల విపరీతమైన వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయని, దీని వల్ల సముద్రంలో తమ చేపల వేట చేయలేక పోతున్నామని ఆందోళనలకు దిగారు. ఈ వ్యర్థాల వల్ల సముద్రంలోని మత్స్య సంపద నశించి పోతోందని రోడ్లపై బైఠాయించి నిరసనలు వ్యక్తం చేశారు. ఇది కేవలం పర్యావరణ కాలుష్య సమస్య ఒక్కటే కాదని, సముద్ర వేటపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాల జీవనాధార సమస్య కూడా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా తమ కుటుంబాల జీవనంపై ప్రభావితం చూపుతోందని నినదించారు. సముద్రంలోకి ఉద్గారాలను వదులుతున్న ఈ ఓన్జీసీ, ఇతర పరిశ్రమల నుంచి తమకు నష్ట పరిహారం ఇప్పించాలని, లేకపోతే ప్రభుత్వమైన నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. దీంతో పాటుగా ఈ పరిశ్రమల కారణంగా సముద్రం నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నిరసన కార్యక్రమాలకు మత్స్యకారులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మద్ధతు తెలుపుతున్నారు. రహదారిని మూసివేశారు. నష్టపరిహారం కింద ఒక్కో కుటుంబానికి రూ. 1.50లు ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్‌ చేశారు.

Read More
Next Story