అస్పియా హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం: ఎస్పీ మణికంఠ చందోలు
x

అస్పియా హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం: ఎస్పీ మణికంఠ చందోలు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుంగనూరు బాలిక హత్య కేసు ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో కొలిక్కి వచ్చింది. ఆర్థిక లావాదేవీలే కారణమని ఎస్పీ చెప్పారు.


పుంగనూరు బాలిక ఆస్పియా హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత నెల 29న బాలిక మిస్‌ అయినా కేసు తేలక పోవడంతో అనేక అనుమానాలకు తెరతీసింది. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు దీనిపై స్పందించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ మంత్రి రోజా వంటి పలువురు నేతలు దీనిపై స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఘటన జరిగితే ఇంత వరకు స్పందించ లేదని రోజా విమర్శించారు. అటు పోలీసులు, ఇటు ప్రభుత్వం దీనిపై తాత్సారం చేయడంలో రాష్ట్ర నలుమూలల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పోలీసులు ఒక కొలిక్కి తెచ్చారు. ఎస్పీ మణికంఠ చందోలు ఆదివారం హడావుడిగా ప్రెస్‌ మీట్‌ పెట్టి వివరాలను వెల్లడించారు.

గత నెల 29వ తేదీన మిస్‌ అయిన బాలిక మూడు రోజులు తర్వాత సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులో శవమై తేలింది. చిన్నారి ఆడుకుంటున్న సమయంలో ఓ మహిళ బుర్కా ధరించి చిన్నారిని కిడ్నాప్‌ చేసినట్టు ఆడుకుంటున్న ఇంకో చిన్నారి తెలపడం జరిగింది. చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి ఇంటికి వస్తే మరికొన్ని చాక్లెట్లు ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు. పాప కిడ్నాప్‌ అయినప్పటి నుండి 12 ప్రత్యేక బృందాలు పాప ఆచూకీ కోసం గాలించాయి. పాప మిస్‌ అయిన రోజే పాపను హత్య చేసి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ లో పడేశారు. పాప శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, పాపపై అత్యాచారం జరగలేదని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం పాప కడుపులో మొక్కజొన్న గింజలు,అన్నం ఉన్నట్లు గుర్తించామన్నారు.మరిన్ని కొత్త కోణంలో చిన్నారి హత్యపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. మరి కొంతమంది అనుమానితులను కూడా విచారించడం జరిగిందన్నారు. చిన్నారి తండ్రి వద్ద దాదాపు 3,50,000 రూ.వడ్డీకి తీసుకున్న ఓ మహిళ ఈ ఘాతుకానికి పాల్పడింది.
దారుణానికి పాల్పడిన మహిళ తో పాటు సమీప బంధువైన ఓ మైనర్‌ బాలుడిని సహాయంతో తన తల్లి ఇంటికి చిన్నారిని తీసుకెళ్ళింది. ఇంట్లో భోజనం పెట్టి చిన్నారి తండ్రిపై ఉన్న కోపం చిన్నారిపై చూపించి ముక్కు, నోరు మూసి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. చిన్నారిని హత్య చేసే సమయంలో చిన్నారి వారిపై గోర్లతో రక్కినట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. చిన్నారి మృతి చెందిందని నిర్ధారించుకుని మైనర్‌ బాలుడి సహాయంతో ద్విచక్ర వాహనంపై సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ వద్దకు తీసుకెళ్లి పడవేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారని, మరికొన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు.
Read More
Next Story