నా కొడుకుతో డైరెక్టుగా ఫైట్ చేయండి: వైఎస్ విజయమ్మ
ఏదిబడితే అది రాస్తున్నారు. రాజకీయాల కోసం ఇంతగా దిగజారాల్నా? షర్మిలమ్మ నా కూతురే కాదంటున్నారు. పరువు నష్టం దావా వేస్తా.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ మరో సారి మీడియా ముందుకొచ్చారు. రాజకీయాలు జుగుస్సాకరంగా ఉన్నాయని చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చింది మాట్లాడుతున్నారని, ఏ బడితే అది రాస్తున్నారని ఆవేదన చెందుతూ తానే ఓ వీడియోను రికార్డు చేసి పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోగా వైరల్‌గా మారింది. అసలు ఆ వీడియోలో ఏముందంటే..
సోషల్ మీడియా, మీడియా చానల్స్‌కు, వెబ్‌సైట్ల యాజమాన్యాలకు, పెద్దలకు వైఎస్ విజయమ్మ అదే వైఎస్ విజయ రాజశేఖరరెడ్డి ఆవేదన. గత కొద్ది రోజులుగా వడ్డి వారిస్తున్న అసత్య కథనాలను చూస్తోంటే చాలా బాధనిపిస్తోంది.. కష్టమనిపిస్తోంది. అదేదో సామెతుంది.. పచ్చ కామెర్ల వానికి అంతా పచ్చగా కనిపిస్తుంట. గత రెండు సంవత్సరాల కిందట జరిగిన ఒక కార్ యాక్సిడెంట్‌ను ఈ రోజు నా కొడుకు మీద పెట్టి అదో కథ అల్లుతున్నారు. నా మనవుడి దగ్గరకు పోతే అదో కథ. ఈ రోజు షర్మిలమ్మ నా కూతురే కాదంటున్నారు. ఇదో కథ. నన్ను అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనాల కొరకు ఇంతగా దిగజారాల్నా? ఇంత నీతి మాలిన, సిగ్గు మాలిన మాటలు.. కథలు అల్లాల్నా? ఒక వ్యక్తి క్యారెక్టర్‌ను ఇంతగా అసాసినేషన్ చేయాల్నా? చాలా బాధాకరంగా అనిపిస్తుంది. జుగుప్సాకరంగా అనిపిస్తుంది. అవమానకరంగా అనిపిస్తుంది. మరి వారికెట్లా అనిపిస్తుందో నాకు తెలియదు.
కుటుంబంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. అయితే అతను తల్లికి కొడుకు కాకుండా పోతాడా? కొడుకికి అమ్మ కాకుండా పోతాదా? అన్నకు చెల్లి కాకుండా పోతాదా? చెల్లికి అన్న కాకుండా పోతాడా? మా పిల్లల్ని చాలా సంస్కారవంతంగా పెంచాం. డిగ్నిఫైడ్‌గా అందరు హర్షించే విధంగా రాజకీయాలు చేయమని కోరుతున్నా. ప్రజలు చూస్తున్నారు. గమనిస్తున్నారు. నా కొడుకుతో డైరెక్టుగా ఫైట్ చేయండి. దయచేసి ఏది బడితే అది మాట్లాడొద్దు. ఏది రాయాలనుకుంటే అది రాయొద్దు.. రాయొద్దని మనవి. ఈ మధ్య రాసిన రెండు లెటర్లు నేను రాసినవే. ఫేక్ లెటర్స్ రాయాల్సిన అవసరం నా కొడుక్కి లేదు. ఇలాగే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే.. నేను డిఫ్లమేషన్ వేయాల్సి వస్తుంది.. అదే పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. అని మాట్లాడారు.
Next Story