ఫెయింజల్‌ తుపాను పోయింది..మరో వాయుగుండం ఏర్పడింది
x

ఫెయింజల్‌ తుపాను పోయింది..మరో వాయుగుండం ఏర్పడింది

ఆంధ్రప్రదేశ్‌కు మరో వాయుగుండం ప్రమాదం పొంచి ఉంది. వాయుగుండం, అల్పపీడనంగా మారనుండటంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


ఆంధ్రప్రదేశ్‌కు తుపాన్‌ తాడి ఏమాత్రం తగ్గడం లేదు. ఒక తుపాన్‌ పోతే మరొకటి తెరపైకి వస్తున్నాయి. వరుస తుపాన్‌ల వల్ల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాజాగా మరో ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాన్‌ ప్రమాదం పొంచి ఉంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై పడనుంది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చమ–వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఇలా కదులుతూ డిసెంబరు 12 నాటికి పొరుగు దేశమైన శ్రీలంక, పక్కరాష్ట్రమైన తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం, వాయుగుండంగా మరే అవకాశం ఉండటంతో భారీ వర్షాలు ఎక్కువుగా పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ఏర్పడిన అనంతరం వాతావరణ మర్పులపై స్పష్టత వస్తుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.



Read More
Next Story