ఫెయింజల్‌ ఉగ్రరూపం..ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..రద్దైన విమానాలు
x

ఫెయింజల్‌ ఉగ్రరూపం..ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..రద్దైన విమానాలు

తుపాను దెబ్బకు ఏపీలో కొన్ని జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పలు కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది.


గత కొద్ది రోజులుగా అలజడి సృష్టిస్తోన్న ఫెయింజల్‌ తుపాను ఏపీలోని కొన్ని జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారీ వర్షాలతో అల్లకల్లోలంగా మారింది. దీని ప్రభావానికి విమనా సర్వీసులను కూడా రద్దు చేశారు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు అకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తిరుపతిలో భారీ వర్షాల కారణంగా విశాఖ–తిరుపతి విమాన సర్వీసులను రద్దు చేశారు. చెన్నైలో తుపాను తీవ్రత ఎక్కువుగా ఉండటంతో విశాఖ–చెన్నై విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. ఫెయింజల్‌ తుపాను నెల్లూరు జిల్లాలో ఉగ్రరూపం చూపిస్తోంది. శనివారం అర్థరాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు టౌన్‌లో పలు కాలనీలు వర్షపు నీరు వచ్చి చేరింది. ముత్తుకూరు, ఇందుకూరుపేట, విడవలూరు, కొడవలూరు వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు తిరుమలలో పలు జలాశయాలు నిండాయి. శ్రీకాకుళం జిల్లాలు భారీ వర్షాల కారణంగా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్‌ తుపాను పుదుచ్చేరిక సమీపంలో తీరం దాటింది. శనివారం రాత్రి 10:30 నుంచి 11:30 గంటల మధ్య తీరం దాటింది. ఇది పశ్చిమ–నైరుతి దిశగా నెమ్మది నెమ్మదిగా కదులుతూ క్రమక్రమంగా బలహీనపడనుంది. ఈ ప్రభావం వల్ల దక్షణిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More
Next Story