మమ్మల్నెందుకు కన్నావు, ఎందుకు చంపావు తండ్రీ?
x

మమ్మల్నెందుకు కన్నావు, ఎందుకు చంపావు తండ్రీ?

పాలులూరి కామరాజు భార్య 2020లోనే ఆత్మహత్య చేసుకుంది.


డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం చిలకలపాడు గ్రామంలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. పావులూరి కామరాజు (35) అనే వ్యక్తి తన ఇద్దరు కుమారులను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కామరాజు చంపిన తన కుమారులు అభిరామ్‌కు 10 ఏళ్లు, గౌతమ్‌కు 7 సంవత్సరాలు ఉంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

స్థానికుల సమాచారం మేరకు, 2020లో కామరాజు భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి కామరాజు తన ఇద్దరు పిల్లలతోనే ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ ఘటనకు ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు లాంటి సంఘటనలే ఈ చావులకు కారణమై ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Read More
Next Story