తండ్రి సీఎం, కుమారుడు డిప్యూటీ సీఎం
x

తండ్రి సీఎం, కుమారుడు డిప్యూటీ సీఎం

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ డిప్యూటీ సీఎంగా ప్రమోషన్‌ లభించింది. ప్రస్తుతం ఆయన యువజన, క్రీడల మంత్రిగా ఉన్నారు.


తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు ప్రమోషన్‌ లభించింది. సీఎం స్టాలిన్‌ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న ఆయనకు తన తండ్రి స్టాలిన్‌ తర్వాత రెండో స్థానం లభించింది. ఉప ముఖ్యమంత్రిగా మంత్రి వర్గంలో చోటు లభించింది. సీఎం స్టాలిన్‌ చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికిన సీఎం స్టాలిన్‌ మరి కొందరి మంత్రుల శాఖలను మార్చారు. ఈడీ కేసులో బెయిల్‌ పై విడుదలైన బాలాజీకి మరోసారి మంత్రిగా అవకాశం కల్పించారు.

డిప్యూటీ సీఎం పదవిపై ఉదయనిధి స్టాలిన్‌ స్పందిస్తూ.. ఉప ముఖ్యమంత్రి అనేది పదవి కాదు బాధ్యత అన్నారు. రాష్ట్రంకోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రమాణం చేయించనున్నారు. ఉదయనిధి స్టాలిన్‌ తో పాటు నలుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుమారుడు, డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా ఉదయనిధి స్టాలిన్‌ ఉన్నారు. ప్రస్తుతం క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ప్లానింగ్‌ డిపార్ట్‌ మెంట్‌ కూడా అతని వద్దే ఉంది. ఉదయనిధి స్టాలిన్‌ కు ప్రస్తుతం 46ఏళ్లు. 2021 మేలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. డిసెంబర్‌ 2022లో స్టాలిన్‌ మంత్రివర్గంలోకి వచ్చారు. గత ఏడాది నుంచి ఉదయనిధి స్టాలిన్‌ ను డిప్యూటీ సీఎంగా నియమించాలని పార్టీ క్యాడర్‌ నుంచి డిమాండ్‌ బలంగా వినిపించింది. అయితే ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాత్రం దానిని పట్టించుకోలేదు. తన కుమారుడికి ఆ పదవి ఇవ్వడానికి మొగ్గుచూపలేదు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్లో ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎంగా ఇచ్చారు.
లోక్‌ సభ ఎన్నికల ముందే ఉదయనిధి స్టాలిన్‌ డిప్యూటీ సీఎంగా ఎంపిక అవుతారని అందరూ భావించారు. కానీ వాయిదా పడింది. తర్వాత ఆగస్టులో ఉయనిధికి పదోన్నతి లభిస్తుందని పార్టీ నేతలు భావించారు. అయితే అప్పుడు కూడా చోటు చేసుకున్న పరిణామాల కారణంగా కార్యరూపం దాల్చ లేదు. డీఎంకే పార్టీ నేత సెంథిల్‌ బాలాజీని ఈడీ అరెస్ట్‌ చేయడంతో మరో సారి నిర్ణయం వాయిదా పడింది. సెంథిల్‌ బాలాజీకి బెయిల్‌ వచ్చిన రెండు రోజులకే సీఎం స్టాలిన్‌ తన ఆలోచనలను మార్చుకున్నారు. సెంథిల్‌ బాలాజీని మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోడంతో పాటు కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ కూడా డిప్యూటీ సీఎంగా మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
Read More
Next Story