ఏపీలో ఘోర ప్రమాదాలు..ఏడుగురు మృతి
x

ఏపీలో ఘోర ప్రమాదాలు..ఏడుగురు మృతి

ఒక రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే స్పాట్‌లోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.


ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గామన్‌ బ్రిడ్జి వద్ద ఆటోనగర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించగా, ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.

విశాఖపట్నం వైపు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. లారీ బలంగా ఈ కారును ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కారులో ప్రయాణిస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న బాధితులను పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా సోమవారం తెల్లవారు జామున కాకినాడకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న లారీకి టైర్‌లో గాలి ఒక్కసారిగా తగ్గిపోడంతో అదుపు తప్పి కారును ఢీకొట్టింది. లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం ఘటన సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం తలతంపరలో గ్రామదేవకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యుత్‌ తీగలు తెగిపడటంతో ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
Read More
Next Story