గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడిపోతున్నారు
x

గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడిపోతున్నారు

సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల గత టీడీపీ పాలనలో ప్రకాశం జిల్లాలో 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని జగన్ మండిపడ్డారు.


రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆందోళనలకు దిగుతామని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబును హెచ్చరించారు. బుధవారం పొదిలి పొగాకు బోర్డును ఆయన సందర్శించారు. పొగాకు బేళ్లను పరిశీలించారు. ధరల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరల గురించి, పెట్టుబడుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్‌ మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు పట్టించుకోని కారణంగా రైతులకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ప్రకాశం జిల్లాలో ఇద్దరు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. ఎంఎస్‌పీ కంటే ధరలకు అమ్ముకునే పరిస్థితులు కూటమి ప్రభుత్వం కల్పించిందని ధ్వజమెత్తారు. ఏ పంట కు గిట్టుబాటు ధరల కనిపించడం లేదని, తమ ప్రభుత్వ హయాంలో రైతులకు పెద్ద పీట వేశామని, కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితులు దిగజారుతున్నాయని జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సీజన్‌ ముగిసే సమయానికి ఇన్‌పుట్‌ సబ్సిడీలను తమ ప్రభుత్వంలో ఇచ్చాం. కానీ కూటమి ప్రభుత్వంలో అది కనిపించడం లేదు. ఇక్రాప్‌లు నిర్వహించి ఉచిత పంటల బీమా కల్పిస్తే.. ఇప్పుడు అదిలేదు. దళారులకు స్వస్థి పలుకుతూ ఏర్పాటు చేసిన ఆర్‌బీకేలను నిర్వీర్యం చేశారు. ఆర్‌బీకేల ద్వారా రైతులకు ఎన్నో సేవలు అందుబాటులోకి తెస్తే.. దానిని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీంతో కల్తీ తాండం చేస్తోందని సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
పొగాకు పంటకు సంబంధించి తమ ప్రభుత్వ హయాంలో హై గ్రేడ్‌ రకానికి క్వింటా ధర రూ. 36వేలు, అంతకంటే తక్కువ గ్రేడ్‌ ఉన్న పొగాకు రూ. 24వేలుకు తగ్గకుండా ధరలు కల్పించి రైతులను ఆదుకుంటే.. కూటమి ప్రభుత్వం పొగాకు రైతులను గాలికి వదిలేసిందన్నారు. మార్చిలో పొగాకు కొనుగోలు చేపట్టాలి. మార్చి, ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో ప్రొక్యూర్‌మెంట్లు పూర్తి కావాలి. దాదాపు 200 మిల్లియన్‌ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంటే.. కేవలం 40 మిల్లియన్‌ టన్నులు మాత్రమే ప్రొక్యూర్‌మెంట్‌ చేసి కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. హైగ్రేడ్‌ క్వాలిటీ ఉన్న పొగాకుకు కూడా ధరలకు లేకుండా పోయాయి. ఇక లోగ్రేడ్‌ పొగాకు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కేజీ రూ. 150 నుంచి రూ. 160 మధ్యలో అమ్ముకుంటున్నారు. అయినా దీనిని కూడా ఎవ్వరూ కొనడం లేదు. దీంతో స్టాక్‌ను వెనక్కి తీసుకెళ్తున్నారు రైతులు. సీజన్‌ అయిపోతున్నా కూటమి కళ్లు తెరవడం లేదని మండిపడ్డారు.
ఇక బ్లాక్‌బర్లీ పొగాకు రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. తమ ప్రభుత్వ హయాంలో రూ. 18వేల వరకు ఈ పొగాకును కొనుగోలు చేశాం. కూటమి ప్రభుత్వం హయాంలో రూ. 6వేలు, రూ. 9వేల అంటున్నారు. అయినా దీనిని కొనే వారు కరువయ్యారు. ఈ నేపథ్యంలో ప్రతి పొగాకు రైతులు సగటున రూ. 80వేల వరకు నష్టపోతున్నారని జగన్‌ అన్నారు. గత 2014–19 మధ్య కాలంలో చంద్రబాబు పాలనలో కూడా పొగాకు రైతులకు ఇదేరమైన అన్యాయం జరిగిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పొగాకు రైతులకు మేలు చేసేందుకు మార్కెఫెడ్‌ను స్వయంగా రంగంలోకి దింపిందన్నారు. మార్కెఫెడ్‌ను ఆక్షన్‌ ప్లాట్‌మీదకు, బయ్యర్‌ హోదాలోకి రంగంలోకి దింపి కొనుగోలులో పోటీని పెంచిందన్నారు. దీని వల్ల రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించామన్నారు. దీని కోసం నాడు రూ. 140 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ఉచిత పంట బీమా కింద తమ ప్రభుత్వం నగదు చెల్లించి రైతులను ఆదుకుందన్నారు. దీంతో 54లక్షల 55వేల మంది రైతులను ఆదుకున్నామన్నారు. బీమా కింద రూ. 7800 కోట్లు ఇన్సూరెన్సులు ఇప్పించామన్నారు. మిర్చి పంటకు ఎకరాకు రూ. 80వేల చొప్పున, పప్పు ధాన్యాలకు ఎకరాకు రూ. 6వేల చొప్పున నష్ట పరిహారం ఇప్పించామని జగన్‌ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి కనిపించడం లేదన్నారు.
గత టీడీపీ పాలనలో ప్రకాశం జిల్లాలో 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిని కూడా చంద్రబాబు ఆదుకోలేదు. వైసీపీ ప్రభుత్వం వారిని నష్టపరిహారం చెల్లించి ఆదుకున్నామన్నారు. తిరిగి సీఎం చంద్రబాబు పాలనలో ప్రకాశం జిల్లాలో రెండు ఆత్మహత్యలు నమోదయ్యాయన్నారు. పర్చూరులో ఒక రైతు, కొండపిలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారని జగన్‌ వెల్లడించారు. మొన్న మిర్చి విషయంలో కూడా సీఎం చంద్రబాబు డ్రామాలు చేశారని ధ్వజమెత్తారు. ఎంత కొనుగోలు చేశారు, ఎంత మంది రైతుల నుంచి కొనుగోలు చేశారని జగన్‌ ప్రశ్నించారు. ఒక్క క్వింటాకు కూడా సీఎం చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు పొగాకు రైతుల పరిస్థితి కూడా దారుణంగా మారిందన్నారు.
పొగాకు ప్రొక్యూర్‌మెంట్‌లో ప్రభుత్వం ఎందుకు ఆక్షన్‌లోకి దిగలేదు, పోటీని ఎందుకు పెంచలేదు, ప్రభుత్వం పోటీ పెంచితే పొగాకు రేట్లు ఎందుకు పెరగవని నిలదీశారు. సీఎం చంద్రబాబు నాయుడుకు, దళారులకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలతో ఈనాడు రైతులకు దారుణ పరస్థితులు నెలకొన్నాయని విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో తమ ప్రభుత్వ పాలనకు, రైతులను ఆదుకోవడంలోను వచ్చిన మార్పులను గమనించాలని ప్రజలను కోరారు. రైతులను ఆదుకోకపోతే ఆందోళనలకు దిగుతామని జగన్‌ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read More
Next Story