ఆంధ్రప్రదేశ్ లో ‘అన్నదాత సుఖీభవ’ అందేదెప్పుడు?
x

ఆంధ్రప్రదేశ్ లో ‘అన్నదాత సుఖీభవ’ అందేదెప్పుడు?

రైతులకు చేరువలో ప్రభుత్వమని చెప్పడమే తప్ప ఆచరణలో శూన్యం అంటున్నారు డాక్టర్ ముచ్చుకోట సురేష్ బాబు

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం-జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బూటకపు హామీలు ఎన్నో సహకరించాయి.

మీకు పదిహేనువేలు, మీకు మీకు అన్నారు, చివరికి వచ్చే సంవత్సరానికి రూట్ మ్యాప్ వేస్తున్నామని దాటవేశారు. విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి పదిహేను వేల కోట్లు భారం వేశారు. రైతులకు మీరిచ్చే బోడి 13,500 ఏంటి, మేము అన్నదాత సుఖీభవ పేరుతో ఇరవై వేలు ఇస్తామన్నారు నయాపైసా విడుదల చేయలేదు. వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరి బిగిస్తున్నారు. మరోవైపు గతంలో ఉపసంహరించుకున్న నల్ల చట్టాలు ఇప్పుడు రూపాంతరం చెంది పేరు మార్చి ప్రవేశపెడుతున్నారు.

గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రింద రాష్ట్రంలో చిన్న సన్నకారు కౌలు రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన కష్టమర్ హైరింగ్ సెంటర్ పథకం అటకెక్కింది. కేవలం ఒక వర్గం ప్రయోజనం కోసం రైతు భరోసా కేంద్రాలు వెలసినట్లు కనిపిస్తుంది. ఆర్బికే ద్వారా విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, రసాయనాలు మరియు రైతులకు పనిముట్లు, వ్యవసాయ ఉపకరణాలు తక్కువ ధరలకు అందించే విధంగా రూపకల్పన చేసాము అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం అవి సక్రమంగా నిర్వహించక అభాసుపాలైంది.

రైతులకు చేరువలో ప్రభుత్వాలని ప్రగల్భాలు తప్ప ఆచరణలో శూన్యం. పెట్టుబడి సహాయం ప్రతి రైతుకు ఇరవై వేలు ఇస్తామన్న ప్రభుత్వం మాట మరిచారు. ఫల సంప్రదాయం రైతులకు కత్తెర, కట్టర్, వ్యవసాయ పనిముట్లు ఇవ్వాల్సిన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారుల జాడే లేదు. మూడు సంవత్సరాల క్రితం ఇంకుడు గుంతలు, పేర్కులేషన్ ట్యాన్క్, కట్ట కాలువలు, ఇంజెక్షన్ వెల్స్ , వ్యవసాయ పనులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. నాబార్డ్ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో అర్థం కాదు.

సోలార్ కోల్డ్ స్టోరేజ్ లు ఎగవేతదారులకు, కార్పొరేట్ వ్యవసాయం చేసే మోతు బారి రైతులకు అప్పజెప్పారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా పశుపోషణ, పొట్టేళ్ల పెంపకం, గేదెలు, ఆవులు పాడి పరిశ్రమకు ఏ రోజైన దరఖాస్తు చేసుకోవచ్చు, జిల్లాకు 20 కోట్లు ఇస్తే అది కేవలం ఎంపీ ఎంఎల్ఏ లకు రాజకీయ నాయకులకు వరంగా మారింది. నిజమైన రైతులకు అన్ని ప్రతికూలతలు. రైతు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇవ్వాలి, మూడు సంవత్సరాలు ఐటి రిటర్న్స్ ఇవ్వాలి, బ్యాంకు అధికారులతో లీడ్ బ్యాంక్ మేనేజర్ తో సఖ్యత ఉండాలి.

ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫీసర్ ద్వారా కొలాటరల్ సెక్యూరిటీ ఉండి పైరవీలు చేయించుకుంటే వచ్చేది గగనం. పాలి హౌస్, వేర్ హౌస్, మాడ్యులర్ సోలార్ స్టోరేజ్ యూనిట్ల నిర్మాణానికి ఇంతవరకు శాంక్షన్ కాలేదు. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో కూడిన రంగాలు దేశం యొక్క జీడీపీలో దాదాపు సగానికి దోహదం చేస్తాయి, భౌతిక డిజిటల్ అవస్థాపనకు ప్రభుత్వ ప్రైవేట్ రంగ మెరుగుదలలు మద్దతుతో స్థిరంగా వృద్ధి చెందుతోందని ప్రభుత్వం భావిస్తున్నది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ భారీ అంతరాయం అంచున ఉంది. విలువ గొలుసు అంతా అసమర్థతను పరిష్కరించే కంపెనీలు వృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

కొత్త తరాల రైతులు పగ్గాలు చేపట్టినందున, వ్యవసాయ విలువ వ్యవస్థ సాంకేతికత పెద్ద పాత్ర పోషిస్తుంది. ఈ రంగానికి ఫైనాన్సింగ్‌కు వేగవంతమైన మెరుగైన యాక్సెస్ కూడా అవసరం. వినూత్న వ్యాపార నమూనా సాంకేతికత స్వీకరణ మైక్రోఫైనాన్స్, అగ్రి వినియోగదారు రుణాలకు యాక్సెస్‌ను పెంచుతోంది. వ్యవసాయరంగం పరిపక్వం చెందుతుంది కొద్దీ కొత్త సవాళ్లు అభివృద్ధి చెందుతాయి. రైతు సమూహాలు ముఖ్యంగా పంటకోత తర్వాత సేవల కోసం సామర్థ్యం, స్థిరత్వం పెంపొందించుకోవాలి. పారదర్శకమైన నమ్మదగిన డేటా, ఫైనాన్సింగ్ కొత్త పద్ధతులను అవలంబించడం కోసం రైతులతో నమ్మకాన్ని పెంపొందించడం భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది.

గ్రామాలు, గ్రామస్తులు అధిక పరిజ్ఞానం కలిగి ఉన్నారని ఎప్పటికప్పుడు మారుతున్న ప్రకృతికి అనుగుణంగా జీవించడంలో వారి నైపుణ్యాన్ని అర్థం చేసుకోవడం వాటిని నిజ జీవితంలో అన్వయించుకోవడం ప్రతి రైతు కర్తవ్యం. ప్రకృతితో మమేకమవుతూ సేంద్రియ వ్యవసాయాన్ని సుస్థిర అభివృద్ధి వైపు తీసుకుపోవలసిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఆవిష్కరణలకు ప్రేరణ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ నుండి వచ్చింది.

ఈ మధ్య కాలంలో గ్రామీణ ఆవిష్కరణలకు ప్రభుత్వం నుంచి ఏమాత్రం ప్రోత్సాహం లేదు. భూములలో సేంద్రియ కర్బనం తగ్గిపోయింది.దేశంలో 25 కోట్ల మంది రైతులకు భూసార పరీక్షలు నిర్వహించామని గర్వంగా చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదు. అవసరమైన డి ఏ పి, యూరియా , విత్తన శుద్ధి చేసే ఫంగిసైడ్ సరఫరా రైతు భరోసా కేంద్రాల ద్వారా చేయలేదు. రైతు సంక్షేమము కొరకు రైతు సంఘాల ద్వారా గుంటకలు, పల్టార్, గొర్రు, రోటవేటర్, ట్రాక్టరు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పిన ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా అప్లికేషన్ స్వీకరించి కేవలం ఒక వర్గం రైతులకు కష్టమర్ హైరింగ్ సెంటర్లు ఇవ్వడం జరిగింది.

రైతు సంఘంలో విభిన్న కులాలు ఉండాలి, సంఘంలో సభ్యులు ఒకే కులము మరియు బంధువులు, రక్త సంబంధీకులు ఉండకూడదు. కానీ చాల మండలాల్లో కేవలం ఒకే కులానికి చెందిన వారు రైతు సంఘాన్ని, కస్టమర్ హైరింగ్ సెంటర్లను లీడ్ చేస్తున్నారు. నిబంధనలన్నీ తుంగలో తొక్కి నాంకేవాస్తే ఇతర కులాలను రైతు సంఘంలో ఉన్న వారి పాత్ర నామమాత్రం. కష్టమర్ హైరింగ్ సెంటర్లలో లీడ్ తీసుకునే వారు వెనుకబడిన తరగతులకు, షెడ్యూలు కులాలు , షెడ్యూలు తరగతులకు చెందిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి.

చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం ఉండేట్లు ప్రభుత్వ పథకాలు ఉండాలి, లేకపోతే ప్రయోజనం ఉండదు. జిల్లాలో డ్రోన్లు ఇవ్వడానికి శ్రీకారం చుట్టి అమలు పరచక పక్కన పెట్టారు. డ్రోన్ల వినియోగం రైతులకు వ్యవసాయ అధికారులకు తెలియదు. జీరో బడ్జెట్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయం సుస్థిర వ్యవసాయం ప్రాకృతిక వ్యవసాయం అని ప్రతి రోజు ఊకదంపుడు ప్రసంగాలు చేసే అధికారులు మరోవైపు రసాయన మందులు పిచికారి చేయడానికి డ్రోన్లను వినియోగించడం విడ్డురంగా ఉంది. డ్రోన్ల వినియోగంపై వ్యవసాయ అధికారులకు శిక్షణ లేదు, ఇంతవరకు వీటిని చూసిన పాపాన అధికారులు చేయలేదు.

బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ లో కానీ రాష్ట్ర బడ్జెట్ అవుట్ కమ్ లో డ్రోన్ల ప్రస్తావన లేదు. సంవత్సరాలుగా భూసార పరీక్షలు చేయలేదు. భూములు నిస్సారం చేసి రసాయన క్రిమి సంహారకాలు వినియోగం ఎక్కువయ్యింది, భూములలో సేంద్రియ కర్బనం తగ్గి భూములు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. గతంలో మట్టి నమూనాలు సేకరించకుండా సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేశారు. 2018 వరకు కేంద్ర ప్రభుత్వ గ్రిడ్ పథకం ద్వారా సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేశాం తర్వాత భూసార పరీక్షలు నిర్వహించలేదని చెబుతున్న అధికారులు, కేటాయింపులు లేని ప్రభుత్వ పథకాలు కేవలం ప్రచార ఆర్భాటాలకే తప్ప నిజమైన గ్రామాభ్యుదయం కనపడుటలేదు.

రైతులకు తక్షణమే పంట నష్టం అంచనా వేసి, ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ , ఇంటరెస్ట్ సుబ్వెన్షన్, ప్రాంప్ట్ రీ పేమెంట్ ఇన్సెంటివ్ రైతుల ఖాతాల్లోకి జమ చేయాలి. రైతులకు నాణ్యమైన విత్తనాలు, మైక్రో ఇరిగేషన్లో భాగమైన డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్లు, లాడర్ పంపిణీ చేయాలి. వ్యవసాయ పనిముట్లకు భారీగా రాయితీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Read More
Next Story