పవన్ కల్యాణ్‌పై ఉప్పొంగిన అభిమానం.. కోట్లకు పడగలెత్తిన వ్యాపారం
నేతలు, అభిమాన నాయకుల ఫొటోలు, పార్టీ సింబల్స్‌తో వాహనాలకు నంబర్ల ప్లేట్లను వేయించుకోవడం ట్రెండ్‌గా మారింది. ఖర్చుకు వెనుకాడ్డం లేదు. కోట్లల్లో వ్యాపారం సాగింది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలోను, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోను పెద్ద ఎత్తున ప్రజాదరణ కలిగిన పవన్ కళ్యాణ్ పేరుతో ఎన్నికల సమయంలో కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులు తమ వాహనాలకు ఆయన పేరుతో కూడిన నంబర్ ప్లేట్లు వేసుకుని పవన్‌పై తమ అభిమానం చాటుకునేందుకు ఎగబడ్డారు. దీని కోసం ఖర్చుకు కూడా వెనుకాడ లేదు. పోటీలు పడి రకరాల డిజైన్లతో కూడిన ప్లేట్ల వైపు మొగ్గు చూపారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే కొటేషన్‌తో పాటు పవన్ కళ్యాణ్ ఫొటోను, జనసేన పార్టీ సింబల్‌తో కూడిన నంబర్ ప్లేట్లు ప్రత్యేకంగా తయారు చేయించుకొని, వాటిని తమ వాహనాలకు పెట్టుకొని తిరగడం పెద్ద ఫ్యాషన్‌గా మారింది. టీడీపీ నేతలైన చంద్రబాబు నాయుడు, లోకేష్‌తో పాటు స్థానిక నేతల పేర్లతో నంబర్ ప్లేట్లు తయారు చేయించుకున్నా, వారందరి కంటే పవన్ కళ్యాణ్ అభిమానులే ముందు వరసలో నిలచారు.
ఎన్నికల ముందు నుంచే ఇలాంటి వాతావరణం నెలకొంది. అయితే కౌంటింగ్ జరిగి ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఇది పతాక స్థాయికి చేరింది. ఫలితాలు విడుదలైన ఒక వారం పాటు నంబర్ల ప్లేట కోసం పెద్ద ఎత్తున క్యూ కట్టారు. అన్ని వయసుల వారు ఉన్నా.. ప్రత్యేకించి యువత ఈ రకమైన పబ్లిసిటీ వైపు మొగ్గు చూపారు.
ఇలాంటి ప్లేట్లు తయారు చేసేందుకు ఖర్చు కూడా ఎక్కువుగానే అవుతుంది. ఆయా రకాల డిజన్లను బట్టి ఒక్కో దానికి రూ. 700 నుంచి రూ. 2వేల వరకు కూడా ఖర్చు అవుతుంది.
ఇలాంటి డిజైన్లతో కూడిన ప్లేట్లను తయారు చేయడంలో విజయవాడ నగరం పెట్టింది పేరు. విజయవాడలో ఎలాంటి డిజైన్లతో కూడిన ప్లేట్లైనా తయారు చేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి పవన్ కల్యాణ్ అభిమానులు కన్ను విజయవాడ మీద పడింది. దీంతో విజయవాడలోని డిజైన్లు చేసే షాపులకు పెద్ద ఎత్తున ఒక్క సారిగా డిమాండ్ పెరిగింది. అటు ఉత్తరాం్ర«ద ప్రాంతమైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, ఇటు రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా విజయవాడకు వచ్చి వారికి నచ్చినట్లు ప్లేట్లు డిజైన్లు చేయించుకొని వెళ్లడం మొదలు పెట్టారు. విజయవాడకు సమీప ప్రాంతాల్లో ఉన్న వారైతే వాహనాల మీదే వచ్చి వారికి కావలసిన డిజైన్లతో కూడిన ప్లేట్లను చేయించుకొని వెళ్ళేవారు. ఒక వేళ వాహనాలపై విజయవాడకు రాలేని వారు ఆయా షాపులను సంప్రదించి, వారికి ఆర్డర్లు ఇచ్చి తయారు చేయించుకొనే వారు.
ఆకర్షణీయంగా డిజైన్లు చేసి ప్లేట్లను తయారు చేసే షాపులు విజయవాడ నగరంలో దాదాపు 120 నుంచి 130 వరకు ఉంటాయి. ఎన్నికల ముందు నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వరకు దాదాపు నెల రోజుల పాటు ఇలాంటి ఆర్డర్లు ఉన్నా, ఫలితాలు వెలువడిన నాలుగైదు రోజుల్లోనే అధికంగా వ్యాపారం జరిగిందని తన పేరును చెప్పడానికి ఇష్ట పడని ఒక షాపు నిర్వాహకుడు వెల్లడించారు. ఒక్కో షాపుకు తక్కువలో తక్కువ రూ. కోటి నుంచి రూ. 2 కోట్ల వరకు వ్యాపారం జరిగిందని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, స్థానిక నేతల పేర్లతో కూడి నంబరు ప్లేట్ల కంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా వంటి కొటేషన్, పలన్ కళ్యాణ్ ఫొటో, జనసేన పార్టీ సింబ్‌తో కూడిన ప్లేట్లను వేయించుకునేందుకే ఎక్కువ మంది కస్టమర్లు మొగ్గు చూపారని చెప్పుకొచ్చారు. ఒక్క సారిగా డిమాండ్ పెరగడం, సుదూర ప్రాంతాల నుంచి ఆర్డర్లు పెరగడంతో నిద్రహారాలు మానేసి పని చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇప్పుడు చాలా వరకు అలాంటివి తగ్గి పోయాయని, ఒకటి ఆరా వస్తున్నారని చెప్పారు.
వీటిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇది వరకే స్పందించారు. పిప్యూటీ సీఎం హోదాలో ఆయన తొలి సారి పిఠాపురంలో మాట్లాడుతూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే జాగ్రత్త.. చెడ్డ పేరు తేవొద్దు.. పోలీసులు, ఆర్టీఏ అధికారులు వాహనాలు ఆపి నంబర్ ప్లేటు ఏదంటే పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా అంటే తనను కొడతారని, తనను తిడతారని, అలాంటివి పక్కన పెట్టి నిబంధనలు పాటించాలని, నిబంధనలు జనసైనికులే పాటించక పోతే ఎలా అని సున్నితంగానే వార్నింగ్ ఇచ్చారు. అంతగా సరాదాగా ఉంటే అప్పుడప్పుడు తిరగండి అని, తనకు రెండు ఎకరాల స్థలం ఉందని, దాని వచ్చి బైక్‌లు, కార్లు వేసుకొని తిరగండని, కావాలంటే అక్కడ బైక్ రేస్‌లు పెడుతామని, హెల్మిట్లు వంటివి పెట్టుకొని దెబ్బలు తగలకుండా తిరగండని çసుతిమెత్తంగా సూచించారు.
Next Story