తెలంగాణ సీఎస్‌కు అరుదైన గౌరవం.. ఈ రోజు కూడా
x

తెలంగాణ సీఎస్‌కు అరుదైన గౌరవం.. ఈ రోజు కూడా

సీతారాముల వివాహా వేడుక కోసం భద్రాచలం ముస్తాబయింది. మరికాసేపట్లో సీతారాముల వివాహం


తెలంగాణ సీఎస్ శాంతికుమారికి మంగళవారం అరుదైన గౌరవం దక్కింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించారు. ప్రతి ఏడాది ఈ ఆనవాయితీని సీఎం పాటిస్తారు. కానీ ఈ ఏడాది ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఆ బాధ్యతలను సీఎస్ తీసుకున్నారు. ఆ అవకాశం సీఎస్ శాంతికుమారికి దక్కింది. దీనిపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తనకు ఈ అవకాశం దక్కడం వల్ల ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని అన్నారు. శ్రీరాముల వారి కల్యాణంలో కూడా ఆమె పాల్గొననున్నట్లు సమాచారం.

ముస్తాబయిన భద్రాచలం

శ్రీరాముల కళ్యాణ వేడుకలకు భద్రాచలం ముస్తాబయింది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో శీతారాముల కళ్యాణం జరగనుంది. ముహూర్తం రాగానే వధూవరుల తలలపై జీలకర్ర బెల్లం ఉంచుతారు. అనంతరం శ్రీ రామదాసు చేయించిన మూడు బొట్లు ఉన్న మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మూడు సూత్రాలు ఉన్న తాళిని సీతమ్మ మెడలో కట్టడంతో సీతారాముల కళ్యాణ వేడుకలో కీలక ఘట్టం పూర్తవుతుంది. అనంతరం తలంబ్రాలను సీతారాములపై పోస్తారు. ఆ తర్వాత స్వామి, అమ్మవార్లకు తాత్కాలిక నివేదన అనంతరం బ్రహ్మముడి వేసి మంగళ హారతి అందిస్తారు. వివాహం పూర్తయిన సీతారాములను పల్లకిలో భద్రాచల వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోని తీసుకెళతారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. భక్తుల సౌకర్యార్థం 238 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా మహాలక్ష్మీ పథకం చెల్లుబాటు అవుతుందని అధికారులు వెల్లడించారు.

Read More
Next Story