‘నా బంధువులన్నా నమ్మొద్దు’.. ప్రజలకు మంత్రి కీలక సూచనలు
x

‘నా బంధువులన్నా నమ్మొద్దు’.. ప్రజలకు మంత్రి కీలక సూచనలు

మోసగాళ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సుభాష్ వ్యాఖ్యానించారు. తన బంధులమని చెప్పి ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులడిగితే అస్సలు నమ్మొద్దన్నారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కీలక సూచనలు చేశారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మధ్య మోసాలు పెరిగిపోయానని, ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నొమ్మొద్దని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆఖరికి కొందరు తన పేరు కూడా చెప్తారని, తన బందువులమంటూ ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి టోకరా వేస్తారని, అలా ఎవరు ఎన్ని చెప్పినా అసలే నమ్మొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా అలా తన బంధువులమని చెప్పి ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు అడిగితే వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు గానీ, స్వయంగా తనకే గానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు అందుకున్న తర్వాత సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పారు. ఇందుకు విజవాడలో జరిగిన ఘటనే ఉదాహరణ అని కూడా చెప్పారాయన.

‘ఇటీవల విజయవాడలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఓ వ్యక్తి వెళ్లి నానా హంగామా సృష్టించాడు. తాను మంత్రి సుభాష్ బావమరిదినని చెప్పుకుంటూ రెచ్చిపోయాడు. ఈ విషయం నాకు తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించా. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని పట్టుకుని అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి మోసగాళ్లు వలలో అమాయక ప్రజలు చిక్కుకోకూడదనే ఈ విషయాన్ని చెప్తున్నాను. నేను ఎప్పుటికీ డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పించను. ఎవరైనా ఏ ఉద్యోగానికైనా ఉన్న నిర్దేశిత మార్గం ద్వారా అప్లై చేసుకుని, అన్నింటిలో క్వాలిఫై అయిన తర్వాతనే ఉద్యోగాన్ని పొందాలనే నమ్ముతాను. ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఒక్కోసారి కొందరు మరో అడుగు ముందుకేసీ నాలా ఫోన్‌లో మాట్లాడించినా నమ్మొద్దు. అలాంటి వారిని గురించి తక్షణం పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలి’’ అని చెప్పారాయన.

జాబ్ మెళాను సద్వినియోగం చేసుకోండి

అలాంటి మోసాల్లో చిక్కుకుని ఇబ్బంది పడకుండా ఈ నెల 20న తమ ప్రభుత్వం నిర్వహించే జాబ్ మెళాను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రామచంద్రాపురం వేదికగా జరగనున్న ఈ జాబ్‌మేళాలో 30 ప్రముఖ ఐటీ, ఫార్మసీ సంస్థలు పాల్గొంటాయని, వికాస ఆధ్వర్యంలో స్థాని వీఎస్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో ఈ జాబ్‌ మెళా నిర్వహించనున్నట్లు వెల్లడించారాయన. వీటితో పాటుగా అనేక కారణాలతో విద్యను మధ్యలోనే విడిచిన యువతకు కూడా ఉద్యోగావకాశాలు కల్పించేలా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ప్రతి ఒక్కరికి అర్హతకు తగ్గ ఉద్యోగావకాశాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే జాబ్ మెళా నిర్వహిస్తున్నామని, యువత ఎప్పటికైనా తమ కాళ్లపై తామే నిలబడాలి అన్న అజెండాతోనే తాము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వ్యాఖ్యానించారు.

జాబ్ మెళాకు వారే అర్హులు

ఈ నెల 20న నిర్వహించే జాబ్‌ మేళాలో బడాబడా సంస్థలు సైతం పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్నీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులై 35 ఏళ్లోపు వయసు ఉన్న వారు ఈ జాబ్ మేళాలోని ఉద్యోగాలకు అర్హులు. అర్హులైన యువత అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారాయన. ఈ ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా తమ ప్రభుత్వం పెట్టుకుందని చెప్పారు. ఆ దిశగానే తమ ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని, అందులో ఈ జాబ్‌ మేళా తొలి మెట్టు మాత్రమేనని అన్నారు.

Read More
Next Story