ఈసీ కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీలకు అనుకూలం..
x

ఈసీ కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీలకు అనుకూలం..

ఎన్నికల కౌంటింగ్‌కు గంటల వ్యవధే ఉంది. ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్‌ను భారీ బందోబస్తు మధ్య నిర్వహిస్తూ, ఆ సమయంలో ఎక్కడా అల్లర్లు జరగకుండా..


ఎన్నికల కౌంటింగ్‌కు గంటల వ్యవధే ఉంది. ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్‌ను భారీ బందోబస్తు మధ్య నిర్వహిస్తూ, ఆ సమయంలో ఎక్కడా అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకుంటూ తాము ఎవరినీ కనికరించమని ఈసీ ఎప్పటికప్పుడు చెప్పకనే చెప్తుంది. తాజాగా ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలను నియంత్రించే విధంగా తీసుకున్న నిర్ణయాలకు విరుద్దంగా ఉంది ఈ కొత్త నిర్ణయం. అదే కౌంటింగ్ కేంద్రంలో రెండో ఏజెంట్‌ను అనుమతించడం. దీంతో కౌంటింగ్ ఏజెంట్‌గా ప్రతి పార్టీ ఇద్దరిని నియమించుకోవచ్చు. ఇది రాజకీయ పార్టీలకు సంతోషం కలిగిస్తున్నాయి.

ఇద్దరు ఏజెంట్లు ఎక్కడెక్కడంటే..

ఇప్పటివరకు కౌంటింగ్ కేంద్రంలో సాధారణంగా ఎప్పుడూ ఉండే ఏజెంట్‌తో పాటు అదనంగా మరో ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి టేబుల్ దగ్గర మరో ఏజెంట్‌ను నియమించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అభ్యర్థి లేని సమయంలో మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించుకునేలా రాజకీయ పార్టీల ఏజెంట్ల‌లకు అవకాశం కల్పించినట్లు ఈసీ తెలిపారు. తద్వారా ఓట్లు లెక్కింపు ప్రక్రియపై ఏ పార్టీ అభ్యంతరం లేవనెత్తకుండా ఉంటాయని, లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతుందని ఈసీ ధీమా వ్యక్తం చేసింది.

అసలు ఈ ఏజెంట్‌లు ఎవరు

ఎన్నికల కౌంటింగ్ సమయంలో పార్టీల ప్రతినిధులుగా ఉండేవారే ఏజెంట్లు. కౌంటింగ్ వేల ఈ ఏజెంట్‌లు అత్యంత కీలక పాత్ర పోషిస్తారు. కౌంటింగ్ కేంద్రంలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుండటమే వీరి పని. ప్రతి పార్టీ కూడా తమకు విధేయులుగా ఉన్న వారిని ఏజెంట్‌గా ఎంపికచేస్తుంది. కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు ఏమాత్రం అలసత్వం కనబరచకూడదు. ఇందుకోసం కౌంటింగ్ ప్రక్రియ, అక్కడ చేయాల్సిన పనులపై పార్టీలు తమ ఏజెంట్లకు కౌంటింగ్‌కు ముందు మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తుంది. ఈ శిక్షణలో కౌంటింగ్ వేళ వారు ఎలా నడుచుకోవాలో కూడా వారిని నేర్పిస్తారు. అసలు వారు అంత జాగ్రత్తగా ఎందుకు ఉండాలి, లేనిపక్షంలో ఎలాంటి అనర్థాలు జరగొచ్చు అనే అంశాలను కూడా పార్టీలు వివరిస్తాయి. మరి ఇప్పుడు ఈసీ తీసుకున్న నిర్ణయం పార్టీలకు ఎంతమేర మేలు చేస్తుందో చూడాలి.

Read More
Next Story