పల్నాడుకు కలెక్టర్.. మూడు జిల్లాలకు ఎస్పీలు
ఆంధ్రలో హింసాత్మక ఘటనలు పెట్రేగిపోతున్న క్రమంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించింది.
ఆంధ్రలో హింసాత్మక ఘటనలు పెట్రేగిపోతున్న క్రమంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ హింసాత్మక ఘటనలను అణచివేసే చర్యల్లో భాగంగా ఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేసిన జిల్లాలకు కొత్త అధికారులను నియమించింది. పల్నాడు జిల్లాలకు నూతన కలెక్టర్కు కూడా నియమించింది. ఈ నేపథ్యంలో పల్నాడు కలెక్టర్గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీ నియమితులయ్యారు. ఆయనతో పాటు పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి సాలిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.
హింసాత్మక ఘటనలే కారణం
ఆంధ్రలో పోలింగ్ సమయంలో, ఆ తర్వాత నుంచి కూడా కొనసాగుతున్న హింసాత్మక చర్యలపై కేంద్రం ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. అందులో భాగంగానే మూడు జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులపై కొరడా ఝుళిపించింది. తాజాగా వారి స్థానాల్లో కొత్త అధికారులను నియమించింది. వారు వీలైనంత త్వరగా బాధ్యతలు స్వీకరిస్తారని వివరించింది.