
పులివెందులకు ఉప ఎన్నిక - రఘురామ హాట్ కామెంట్స్
ఈసారి అసెంబ్లీకి జగన్ హాజరు కాకపోతే సభ్యత్వం కోల్పోతారా?
ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాకపోతే పులివెందుల అసెంబ్లీకి బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండవచ్చని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజు చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష హోదా అడుగుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు.పశ్చిమగోదావరి జిల్లాలో రఘురామ కృష్ణంరాజు పర్యటించారు. ఎమ్మెల్యేలు శాసనసభా సమావేశాలను బహిష్కరిస్తే ఆ పదవికి అర్హత లేనట్లుగానే భావించాలని పేర్కొన్నారు.జగన్ చంటి పిల్లొడని,చందమామా కోసం మారాం చేసినట్లుగా ఆయన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. జగన్ 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్‌గా డిస్ క్వాలిఫై అయిపోతారని రఘురామ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.వైసీపీ గెలిచిన 11 స్థానాలకు కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని రఘు రామ కృష్ణంరాజు పేర్కొన్నారు.
వయసులో పెద్దవాడిగా, శాసనసభా ఉపసభాపతిగా సమావేశాలకు జగన్ రావాలని కోరుతున్నానని అన్నారు. ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు రావడానికి జగన్ సిద్ధమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ విసిరిన సంగతిని రఘురామ గుర్తుచేశారు. ఆ సవాల్‌ను జగన్ స్వీకరించాలని సూచించారు.అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను చర్చించాలని కోరారు.
Next Story