కర్నూలు డ్రోన్ సిటీ వస్తే ఇంజినీర్ల పంట పండినట్టే!
x
డ్రోన్స్-జాబ్స్ గ్రాఫిక్స్

కర్నూలు డ్రోన్ సిటీ వస్తే ఇంజినీర్ల పంట పండినట్టే!

డ్రోన్ సిటీలో ఉద్యోగానికి ఏయే కోర్సులు చేసి ఉండాలో, ఎక్కడెక్కడ నేర్పుతున్నారో చదవండి..


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లా ఓర్వకల్లులో దేశంలోనే తొలి డ్రోన్ సిటీ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. ఈమేరకు aerpace Industries తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (APEDB) అమలు చేస్తుంది. డ్రోన్ టెక్నాలజీలు, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్ రంగాలలో ఇదో పెద్ద ముందడుగా భావిస్తున్నారు.

CII పార్టనర్‌షిప్ సమిట్‌లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయుష్ గోయల్ కలిసి డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శంకుస్థాపన చేశారు.
ఓర్వకల్‌లో 300 ఎకరాల విస్తీర్ణంలో ఈ డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. వికసిత్ భారత్ విజన్‌కు అనుగుణంగా టెక్నాలజీ ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడంపై రాష్ట్రం దృష్టి పెడుతోంది.
ఇందులో ఏయే సంస్థలు పాల్గొంటాయంటే...
ఈ ప్రాజెక్టులో aerpace సంస్థ APEDBతో కలసి పని చేస్తాయి. అధునాతన డ్రోన్ తయారీ, టెస్టింగ్ సదుపాయాల ఏర్పాటు, డిఫెన్స్ Unmanned Aerial Vehicles (UAVs), లాజిస్టిక్స్ డ్రోన్లు, AI ఆధారిత ప్లాట్‌ఫామ్‌లకు అనుకూలంగా ఈ సెంటర్ ఉంటుంది.

పరిశోధన, శిక్షణ, విడి భాగాల తయారీ, అభివృద్ధి, సిస్టమ్ లెవల్ ఇన్నోవేషన్‌కు సహకారం అందిస్తుంది.
aerpace సంస్థతో పాటు aerShield, aerWing సంస్థలు కూడా తోడ్పాటు అందిస్తాయి.
aerpace ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి సోని మాటల్లో చెప్పాలంటే.. “దేశానికి ఏరోస్పేస్, డిఫెన్స్, అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్ రంగాల్లో స్వయం సామర్థ్యం పెంపొందించుకునే కీలక అవకాశమిది.
డ్రోన్ సిటీ అంటే ఏమిటీ?
డ్రోన్లు, అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్, ఏరోస్పేస్ టెక్నాలజీలకు ప్రత్యేకంగా రూపొందించిన ఒక ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ నే డ్రోన్ సిటీ.
ఇది సాధారణ పారిశ్రామిక పార్క్ కాదు. ఇందులో ఈ అన్ని ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
-డ్రోన్ తయారీ యూనిట్లు- స్మాల్-స్కేల్ నుంచి డిఫెన్స్ గ్రేడ్ UAVల వరకు తయారీ అవుతాయి.
-టెస్టింగ్ జోన్లు & ఫ్లైట్ కారిడార్లు- డ్రోన్లను ఎలాంటి అంతరాయం లేకుండా పరీక్షించడానికి ప్రత్యేక గగన పరిధి.
-రీసెర్చ్ & ఇన్నోవేషన్ సెంటర్లు- AI ఆధారిత డ్రోన్ నావిగేషన్, డిఫెన్స్ సెంసింగ్ టెక్నాలజీలు, లాజిస్టిక్స్ డ్రోన్లు వంటి రంగాల్లో పరిశోధన.
-ట్రైనింగ్ అకాడమీలు- డ్రోన్ పైలట్లు, ఇంజినీర్లు, టెక్నీషియన్లకు శిక్షణ.
-రిపేర్, మెయింటెనెన్స్, కంపోనెంట్ తయారీ
-ఒకే క్యాంపస్‌లోనే అన్నీ స్టార్ట్-అప్స్‌కు ఇంక్యుబేషన్ సపోర్ట్
-డ్రోన్-ఆధారిత లాజిస్టిక్స్, అగ్రి-డ్రోన్లు, సర్వే టెక్నాలజీలు వంటి రంగాల్లో కొత్త కంపెనీల ఎదుగుదలకు మద్దతు.
డ్రోన్ సిటీ ఎందుకు అవసరం?
మున్ముందు మనుషులు లేని డ్రోన్లదే రాజ్యం కాబోతోంది. రక్షణ రంగం భవిష్యత్ అంతా డ్రోన్లదే ఆధిపత్యం కానుంది. చైనా, టర్కీ, ఇజ్రాయిల్ వంటి దేశాలు ఇప్పటికే డ్రోన్ వార్‌ఫేర్‌లో ముందున్నాయి. అందుకే భారత్ ఇప్పుడు ఈవైపు చూస్తోంది. బారీగా పెట్టుబడులు పెడుతోంది.
వ్యవసాయ రంగ భవిష్యత్ డ్రోన్లతోనే.. పంటల స్ప్రే మొదలు భూసర్వే వరకు డ్రోన్లతోనే చేస్తున్నారు. డ్రోన్ సిటీ అంటే అగ్రి టెక్నాలజీలో విప్లవంగా చంద్రబాబు ప్రకటించారు.
భూమికి సంబంధించిన మ్యాపింగ్ లన్నీ డ్రోన్లతో చేస్తున్నారు. సరకు రవాణా మొదలు కొండ ప్రాంతాల్లోకి చేర్చే వరకు సర్వం లాజిస్టిక్స్ వీటి ద్వారానే జరుగుతాయని అంచనా.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక లాభం ఏమిటీ?
కర్నూలు డ్రోన్ సిటీ- రాష్ట్రాన్ని ఏరోస్పేస్ హబ్ గా మారుస్తుంది. టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి లక్ష్యానికి పెద్ద మైలురాయి. భారతదేశంలో ఏర్పాటవుతున్న తొలి డ్రోన్ సిటీ ఇదే. Telangana లో Drone Testing Corridor (Vikarabad) ఉన్నప్పటికీ అది ఫారెస్ట్ ల్యాండ్‌పై టెస్టింగ్ కి మాత్రమే పరిమితం. అది డ్రోన్ల తయారీ, పరిశోధన, ట్రైనింగ్ అన్నీ ఒకే చోట ఉండే “డ్రోన్ సిటీ” కాదు.
Karnataka – Bengaluru Drone R&D ecosystem ల్యాబ్ ఉన్నాయి. Kanpur, Madras, Bengaluru లో IITలలో Drone Zones ఉన్నాయి. Adani, IdeaForge వంటి ప్రైవేట్ క్యాంపస్‌లలో చిన్న చిన్న డ్రోన్ల తయారీ స్టార్టప్స్ ఉన్నాయి. అయితే అవన్నీ డ్రోన్ సిటీ కాన్సెప్ట్ కాదు.

అందువల్ల కర్నూల్‌లో వచ్చే డ్రోన్ సిటీ భారతదేశంలోనే మొదటిది.
ప్రపంచంలో ఎక్కడెక్కడ డ్రోన్ సిటీలు/డ్రోన్ జోన్లు ఉన్నాయంటే?
ప్రపంచంలో కొన్ని దేశాలు ఇప్పటికే ప్రత్యేక డ్రోన్ నగరాలు లేదా ఫ్రీ-ఫ్లైట్ జోన్లను నిర్మించాయి.
దుబాయిలో Dubai Drone City ఉంది. ఇది ప్రపంచంలోనే పెద్ద డ్రోన్ & ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ అంటుంటారు. ఆ తర్వాత China లో డ్రోన్ సిటీ లు Shenzhen, Guangzhou ఉన్నాయి. కొరియా, అమెరికా, జపాన్, బ్రిటన్, ర్వాండా లోనూ భారీ డ్రోన్ల తయారీ కేంద్రాలు ఉన్నాయి.
ఈ కంపెనీల్లోకి వెళ్లాలంటే ఏ కోర్సులు చదివి ఉండాలి?
ఇలాంటి సంస్థల్లో ఉద్యోగాలకు అత్యంత డిమాండ్ ఉన్న కోర్సులు ఇవి:
1. Aeronautical Engineering / Aerospace Engineering
(Drone design, Aerodynamics, Propulsion, Flight mechanics). Drone Cityలో అత్యంత డిమాండ్ ఉండే బ్రాంచ్ లు ఇవి.
2. Mechanical Engineering లో Frame design, Materials, Thermal systems బ్రాంచీలు ఉపయోగపడతాయి.
3. Electronics & Communication Engineering (ECE)లో Sensors, Communication systems, GPS modules బ్రాంచీలు ఉపయోగం
4. Electrical Engineering / Mechatronics లో Motors, Power systems బ్రాంచీలలో ఉత్తీర్ణులై ఉంటే డ్రోన్లలో energy management, battery systems, controllers వంటి ఉద్యోగాల కోసం పనికి వస్తాయి.
5. Computer Science / IT లలో Drone software, Flight control algorithms, AI & computer vision బ్రాంచీలు కూడా AI-driven drone systemsకు అత్యంత అవసరం.
ఇప్పుడు ప్రత్యేకంగా డిమాండ్ పెరుగుతున్న రంగాలలో Robotics Engineering, Artificial Intelligence & Data Science, GIS & Remote Sensing వంటి కోర్సులు కూడా డ్రోన్ల రంగంలో ఉద్యోగాలకు పనికి వస్తాయి.
ఇవన్నీ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. డ్రోన్ సర్వే జాబ్స్‌కు ఇది చాలా ముఖ్యమైన స్కిల్స్.

డ్రోన్ సిటీ రాబోతున్న నేపథ్యంలో ఇంజినీరింగ్ లో Mechanical,,ECE, EEE, CSE, Civil, Aerospace, Mechatronics వంటి బ్రాంచ్‌లకు ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.
దీనిలో Design Engineer, AI/ML Engineer, Drone Test Pilot, Flight Operations Engineer, Electronics Design Engineer, Manufacturing Engineer, GIS Analyst, R&D roles ఇలా అనేక జాబ్ రోల్స్ వస్తాయి.
ప్రత్యేకంగా డ్రోన్ కోర్సులు ఉన్నాయా?
భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన సంస్థలు ప్రత్యేకించి IITs డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. వాటిల్లో ప్రధానమైనవి..
DGCA Certified Drone Pilot Training, DGCA-licensed drone pilot, Drone design, propulsion, flight algorithms, Certification in Drone Applications, IIST (Indian Institute of Space Science & Technology) – UAV Courses, Anna University- UAV Design workshops
ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ కోర్సులు ఎక్కడ?
ఇప్పటికే AP Skill Development Centres (APSSDC) లలో Drone operation, Drone assembling, Mapping, Surveying వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు.
ఓర్వకల్లులో డ్రోన్ సిటీ వచ్చిన తర్వాత ప్రత్యేక శిక్షణ హబ్ వస్తుంది.
శంషాబాద్ లోని GMR Aviation Academy కూడా Drone Pilot training ఇస్తోంది.
ఈ నైపుణ్యాలంటే ఉద్యోగం పక్కా?
CAD Design (SolidWorks, CATIA)
Drone Assembly & Repair
Python + AI + Computer Vision
PCB Designing
ROS (Robot Operating System)
GIS Mapping (ArcGIS, QGIS)
Drone Pilot License (DGCA)
ఎన్ని ఉద్యోగాలు అని ఖచ్చితంగా చెప్పకపోయినా 12 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు, 20 నుంచి 25 వేల వరకు పరోక్ష ఉద్యోగాలు ఉంటాయనేది అంచనా. అయితే ఇవేవీ ఒక్కరోజులోనే ఒక్క ఏడాదిలోనో వచ్చేవి కావు. డ్రోన్లకు పెరుగుతున్న గిరాకీ బట్టి ఉంటాయి.

కర్నూలు డ్రోన్ సిటీ పూర్తిగా పనిచేస్తే కనీసం 40, 50 వేల వరకు ఉద్యోగాలు వస్తాయి. మొత్తం ప్రత్యక్ష ఉద్యోగాల్లో 65–75% ఇంజినీర్లకే వస్తాయి. మిగతావి టెక్నికల్ ట్రైనింగ్‌తో డిప్లొమా, ఐటీఐ విద్యార్థులకు ఉండవచ్చునని డ్రోన్ల ఆపరేటింగ్ పై శిక్షణ పొందుతున్న ఓ అభ్యర్థి చెప్పారు.
Read More
Next Story