![డాక్టర్ సమరం అక్క డాక్టర్ మరు కన్నుమూత డాక్టర్ సమరం అక్క డాక్టర్ మరు కన్నుమూత](https://andhrapradesh.thefederal.com/h-upload/2025/02/06/511040-2222.webp)
డాక్టర్ సమరం అక్క డాక్టర్ మరు కన్నుమూత
శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలో అంత్యక్రియలు జరగనున్నాయి.
ప్రముఖ నాస్తిక ఉద్యమకారుడు గోరా, డాక్టర్ సమరం అక్క ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు, నాస్తికులు డాక్టర్ మరు గురువారం కన్ను మూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలో అంత్యక్రియలు జరగనున్నాయి. విజయవాడ నాస్తిక కేంద్రం నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు అంతిమ యాత్ర, అనంతరం అంత్యక్రియలు జరగనున్నాయి. డాక్టర్ మరు తన నేత్రాలను స్వేచ్ఛ గోరా నేత్ర నిధికి ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి ద్వారా నేత్ర దానం చేశారు.
డాక్టర్ మరు ప్రముఖ స్త్రీల వైద్య నిపుణురాలుగా పేరు తెచ్చుకున్నారు. నాస్తిక కేంద్రం ఆధ్వర్యంలో నడిచే వాసవ్య నర్శింగ్‌హోమ్‌లో చనిపోయేంత వరకు ఆమె వైద్య సేవలు అందించారు. ఆమె తండ్రి ప్రముఖ నాస్తిక వాది గోపరాజు రామచంద్రరావు గోరాగా ప్రసిద్ధి చెందారు. పాతికేళ్ల వరకు ఆస్తికుడిగా ఉన్న గోరా తర్వాత నాస్తికుడుగా మారారు. అనేక సాంఘీక దురాచారాల మీద ఉద్యమాలు చేపట్టారు. ప్రపంచంలోనే మొదటి నాస్తిక సమాజాన్ని కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేశారు. సహపంక్తి భోజనాల వంటి ఉద్యమాలు కూడా నిర్వహించారు. స్వాతంత్య్ర అనంతరం తన నాస్తిక కేంద్రాన్ని విజయవాడకు తరలించారు. తన సంతానానికి ప్రపంచ, దేశ పరిస్థితుల అద్దం పట్టే విధంగా విలక్షణమైన రీతిలో పేర్లు పెట్టారు.
గ్రహణం మొర్రి మీద అవగాహన కల్పించేందుకు గర్భంతో ఉన్న తన భార్యను గ్రహణం సమయంలో బయట తిప్పే వారు. గోరా సతీమణి సరస్వతీ గోరా కూఆ ఆయన బాటలోనే నడిచారు. వారి తదనంతరం డాక్టర్ సమరం, డాక్టర్ మరు కూడా తల్లిదండ్రుల నాస్తిక వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. నాస్తికత్వాన్ని వ్యాపింప చేసేందుకు చేపట్టే కార్యక్రమాల్లో డాక్టర్ మరు విరివిగా పాల్గొనే వారు. మూఢ నమ్మకాలు, మహిళల ఆరోగ్య సమస్యలు, సాంఘీక దురాచారాల మీద అనేక ఉపన్యాసాలు ఇచ్చారు.
Next Story