తెలంగాణలోనూ ‘పూజ ఐఎఎస్ ’ లాంటి కేసు?
యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఎంపికైన దేశాయ్ తాను ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కు చెందిన వ్యక్తిగా చెప్పుకుంటూనే ఆర్ధోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్ గా క్లైం చేసుకున్నారు.
అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారుల ఎంపికలో తెలంగాణా క్యాడర్ కు సంబంధించి మరో గందరగోళం బయటపడింది. మహారాష్ట్ర క్యాడర్ అధికారి పూజా ఖేడ్కర్ వ్యవహారం ఒక వైపు సంచలనంగా మారుతుంటే మరోవైపు అలాంటి సంచలనమే తెలంగాణాలో కూడా బయటపడింది. విషయం ఏమిటంటే తెలంగాణాలోని కరీంనగర్లో అడిషినల్ కలెక్టర్ గా పనిచేస్తున్న ప్రఫుల్ దేశాయ్ ఎంపికపైన కూడా అనేక ఆరోపణలు ముసురుకుంటున్నాయి.
You are Praful Desai, an IAS officer from the 2019 batch with AIR 532 in the EWS and Orthopedically handicapped category.
— Sakshi (@333maheshwariii) July 17, 2024
People on Twitter are sharing photos of you cycling, playing tennis, rafting, and horse riding, claiming you've fully recovered after rigorous training at… pic.twitter.com/9VDoPWtNZb
2019లో యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షలో ప్రఫుల్ దేశాయ్ 532 ర్యాంకు సాధించారు. ఇపుడు దేశాయ్ ను చుట్టుముట్టిన వివాదాలు ఏమిటంటే ఈయన సైక్లింగ్ చేస్తున్న, టెన్నిస్ ఆడుతున్న, గుర్రపు స్వారి, రివర్ రాఫ్టింగ్ చేస్తున్న ఫొటోలు వైరల్ గా మారాయి. ఐఏఎస్ అధికారులు సైక్లింగ్ చేయకూడదా ? గుర్రపు స్వారీ చేయకూడదా ? అనే సందేహాలు రావటం చాలా సహజం. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఎంపికైన దేశాయ్ తాను ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కు చెందిన వ్యక్తిగా చెప్పుకుంటూనే ఆర్ధోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్ గా క్లైం చేసుకున్నారు. ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్ అంటేనే రెండు కాళ్ళు లేదా రెండింటిలో ఏదో ఒకదానికి వైకల్యం ఉన్నట్లే కదా ?
మరి కాలు సరిగాలేని దేశాయ్ సైక్లింగ్, హార్స్ రైడింగ్, టెన్నిస్ ఎలా ఆడగలరు ? అంటు ట్విట్టర్ వేదికగా నెటిజన్ సందేహాలు వ్యక్తంచేశారు. దేశాయ్ గుర్రపు స్వారి, సైక్లింగ్ చేస్తున్న, రివర్ రాఫ్టింగ్ చేస్తున్న ఫొటోలను కూడా నెటిజన్ పోస్టుచేశారు. ఇపుడా ఫొటోలు వైరల్ గా మారాయి. యూపీఎస్సీకి ఎంపిక అవ్వాలని ఎంతోమంది ఎంతో కష్టపడుతున్నారని సదరు నెటిజన్ తెలిపారు. తన ఎంపిక గురించి అలాంటి ఆశావహులందరికీ వివరణ ఇవ్వాలని నెటిజన్ దేశాయ్ ను అడిగారు. మహారాష్ట్రలోని పూజా దేశాయ్ వివాదం ఒకవైపు సంచలనం అవుతున్న నేపధ్యంలోనే దేశాయ్ ఉదంతం వెలుగుచూసింది. వీళ్ళ ఎంపిక విధానాన్ని గమనించిన తర్వాత అసలు యూపీఎస్సీ ఎంపిక విధానంపైనే చాలామందిలో అనుమానాలు పెరిగిపోతున్నాయి.
యూపీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షలు, చేస్తున్న ఇంటర్వ్యూలన్నీ పాదర్శకంగానే జరుగుతున్నాయా అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలో ఎంపికై రెండేళ్ళు ముస్సోరీలోని లాల్ బహద్దూర్ శాస్త్రీ నేషనల్ అకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ తీసుకున్న తర్వాత పోస్టింగులో జాయిన్ అయ్యారు. ఉద్యోగ నిర్వహణలో వీళ్ళ బండారం బయటపడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంత వరకు యూపీఎస్సీ, కేంద్రప్రభుత్వం మేల్కొనలేదంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇపుడు దేశాయ్ ఆర్ధోఫెడిక్ హ్యాండీక్యాప్డ్ వైకల్యాన్ని ఏ విధంగా జయించారనే విషయమై నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిజంగానే దేశాయ్ అంగవైకల్యంతో ఉండి యూపీఎస్సీకి ఎంపికైన తర్వాత ఆ వైకల్యాన్ని అధిగమిస్తే ఆ విషయం ఎంతోమంది యువతకు స్పూర్తిదాయకం అవుతుందనటంలో సందేహంలేదు. మరి వీటికి జవాబులు దేశాయ్ చెబుతారా ? లేకపోతే యూపీఎస్సీ, కేంద్రప్రభుత్వం చెబుతుందా ? అన్నది ఆసక్తిగా మారింది.