డోర్‌ డెలివరీ గాలికి ఎగిరి పోయింది
x

డోర్‌ డెలివరీ గాలికి ఎగిరి పోయింది

ప్రతి పథకం పారదర్శకంగా అమలు చేసాం. అందరికీ అందే విధంగా డోర్‌ డెలివరీ చేశాం. రెడ్‌ బుక్‌ పాలన సాగిస్తున్నారని మండి పడ్డ మాజీ సీఎం జగన్‌.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోవడం లేదని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. శుక్రవారం తాడేపల్లిలోని తన నివాసంలో మాట్లాడుతూ సంక్షేమ పథకాలపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విదానాలను తూర్పార పట్టారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి సంక్షేమ పథకం పారదర్శకంగా అమలు చేశామన్నారు. ప్రతి లబ్దిదారునికి సంక్షేమ పథకాలను డోర్‌ డెలివరీ ద్వారా ఇంటి ముంగిటకు చేర్చామన్నారు. కానీ సీఎం చంద్రబాబు హయాంలో దీనిని గాలికి వదిలేశారని అన్నారు.

పెన్షన్‌లు, రేషన్‌లు డోర్‌ డెలివరీల ద్వారా అందరికీ సకాలంలో అందించామన్నారు. సీఎం చంద్రబాబు హయాంలో డోర్‌ డెలివరీని గాలికి వదిలేశారని మండి పడ్డారు. పారదర్శకత అంత కన్నా లేదని మండి పడ్డారు. గతంలో జన్మభూమి కమిటీల వంటి సమస్యలు తలెత్తకుండా సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి జన్మభూమి కమిటీలను తిరిగి తెరపైకి తెచ్చారని మండి పడ్డారు. పెన్షన్లు కావాలంటే వారి వద్దకు వెళ్లే పరిస్థితిని సీఎం చంద్రబాబు సృష్టించారన్నారు. జన్మభూమి కమిటీలను కలవక పోయినా, వారి ఇళ్ల వద్దకు వెళ్లక పోయినా అలాంటి వారికి పెన్షన్‌లు క్యాన్సిల్‌ చేస్తున్నారని విమర్శించారు.
సీఎం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ్మ ఒడి పథకాన్ని పక్కన పెట్టారన్నారు. రెండు క్వార్టర్లకు ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వ లేదన్నారు. వసతి దీవెన, విద్యా దీవెన పథకాలను పూర్తిగా పక్కన పెట్టారని ద్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో సకాలంలో వీటిని అమలు చేశామని గుర్తు చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారి పోయాయని విమర్శించారు. రెడ్‌ బుక్‌ పాలన రాష్ట్రంలో జరుతుందని మండి పడ్డారు. రెడ్‌ బుక్‌ పాలన సాగిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. న్యాయాన్ని పాతరేసి, ధర్మానికి రక్షణ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. తమ పార్టీకి చెందిన నేతలు, పార్టీ కార్యాలయాల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, దొంగ కేసులు పెడుతున్నారని మండి పడ్డారు. కేసుల్లో కావాలనే ఇరికిస్తున్నారని మండి పడ్డారు. ఇష్టమొచ్చిన రీతిగా పాలన సాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్‌ అయిందన్నారు.
Read More
Next Story