Allu Arjun Arrest|కేటీఆర్ బాధేమిటో అర్ధంకావటంలేదు
x

Allu Arjun Arrest|కేటీఆర్ బాధేమిటో అర్ధంకావటంలేదు

అరెస్టుచేసిన తీరును కేటీఆర్(KTR) తప్పుపట్టారు. అల్లు అర్జున అరెస్టు తీరును తప్పుపడుతు కేటీఆర్ ట్విట్ చేశారు.


కేటీఆర్ బాధేమిటో అర్ధంకావటంలేదు. అయినదానికి కానిదానికీ రేవంత్ రెడ్డిని తప్పుపట్టడమే పనిగా పెట్టుకున్నట్లున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సినీహీరో అల్లు అర్జున్(Allu Arjun Police arrest) ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పుష్పసినిమా-2(Pushpa-2) రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో(Sandhya Theatre) జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. తొక్కిసలాటలో తన భర్య మరణానికి అల్లు అర్జునే కారణమని మృతురాలి భర్త భాస్కర్ ఫిర్యాదుచేశారు. దాని ఆధారంగానే చిక్కడపల్లి పోలీసు(Chikkadapalli Police)లు ఈరోజు అర్జున్ను తనింట్లో అరెస్టు చేశారు. ఆ అరెస్టుచేసిన తీరును కేటీఆర్(KTR) తప్పుపట్టారు. అల్లు అర్జున అరెస్టు తీరును తప్పుపడుతు కేటీఆర్ ట్విట్ చేశారు. ఆ ట్వీట్ చూసిన తర్వాత అసలు కేటీఆర్ బాధేమిటో అర్ధంకావటంలేదని కాంగ్రెస్ నేతల నుండి సెటైర్లు మొదలయ్యాయి.

కేటీఆర్ ఏమన్నారంటే బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ అరెస్టు పాలకులు అంటే రేవంత్ రెడ్డిలోని అభద్రతకు ఉదాహరణగా చెప్పారు. అలాగే సామాన్య నేరస్తుడిని అరెస్టుచేసినట్లుగా అర్జున్ను అరెస్టుచేయటం ఏమిటని మండిపోయారు. అర్జున్ టాప్ హీరో అన్న విషయాన్ని ప్రభుత్వం మరచిపోయినట్లుందన్నారు. ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. జరిగిన తొక్కిసలాటకు ప్రత్యక్షంగా సంబంధంలేని అర్జున్ను ఇలాగ అరెస్టుచేయటం ఏమిటని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఇక్కడ కేటీఆర్ వైఖరి స్పష్టంగా తెలుస్తోంది. అదేమిటంటే ఎక్కడ ఏమి జరిగినా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయటమే అజెండాగా పెట్టుకున్నారు. ఇపుడు కూడా అదే కనబడుతోంది. తొక్కిసలాటకు అర్జున్ కు ప్రత్యక్షంగా సంబందంలేదని చెప్పటమే విచిత్రంగా ఉంది. అసలు సినిమా థియేటర్లో తొక్కిసలాట జరిగిందే అల్లు అర్జున్ వల్ల. పోలీసులకు చెప్పకుండా, థియేటర్ యాజమాన్యానికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఊరేగింపుగా ఓపెన్ టాప్ జీపులో రావటమే అల్లు అర్జున్ తప్పని కేటీఆర్ అనిపించకపోవటమే ఆశ్చర్యం. ఓపెన్ టాప్ జీపులో అర్జున్ ను చూసిన తర్వాతే జనాలు థియేటర్లోకి ఒక్కసారిగా చొచ్చుకువచ్చారు. దాని ఫలితమే థియేటర్లో తొక్కిసలాట జరిగటం, మహిళ చనిపోవటం. జరిగిన ఘటనలో అర్జున పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నా కేటీఆర్ మాత్రం హీరోను వెనకేసుకు రావటమే ఆశ్చర్యంగా ఉంది.

ఇక జాతీయ అవార్డు గ్రహీత అర్జున్ ను మామూలు నేరస్తుడిగా అరెస్టుచేస్తారా ? అని అడిగారు. అర్జున్ మీద నమోదైన కేసు చిన్నా చితకా కేసు కాదు. ఒక మహిళ మరణానికి కారకుడనే సెక్షన్లు 105, 119(1), రెడ్ విత్ 3/5 బీఎన్ఎస్ కేసు నమోదుచేశారు. పై సెక్షన్లలో ఏ ఒక్కదానిలో నేరనిరూపణ అయినా 5 నుండి 10 ఏళ్ళు శిక్షపడటం ఖాయం. 105 సెక్షన్ అంటే నాన్ బెయిలబుల్ కేసు. ఇక్కడ కేటీఆర్ మరచిపోయింది ఏమిటంటే నేరస్తుడే నేరస్తుడే అని. తన వల్ల ఒక మహిళ మరణించటాన్ని కేటీఆర్ చాలా తేలికగా తీసుకుంటున్నట్లున్నారు. అందుకనే జాతీయ అవార్డు గ్రహీతను ఇలాగ అరెస్టు చేస్తారా ? అని అడిగారు. అరెస్టు చేయటానికి జాతీయ అవార్డు గ్రహీత అనే ట్యాగ్ లైన్ ఏమన్నా రక్షణగా నిలుస్తుందని కేటీఆర్ అనుకుంటున్నారా ? కేసులు పెట్టడం, నోటీసులు జారీచేయటం, అరెస్టులు, కోర్టులో ప్రవేశపెట్టడం అంతా పోలీసులు చూసుకుంటారు. మధ్యలో రేవంత్ ను పిక్చర్లోకి లాగటం ఎందుకో అర్ధంకావటంలేదు. అర్జున్ అరెస్టులో రేవంత్ లోని అభద్రతాబావం కేటీఆర్ కు ఏమి కనిపించిందో ?

Read More
Next Story