
చౌక బిర్యానీ అని ఎగ పడకండి!!
ఏదైనా తేడా వస్తే ఈ నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయండి..
ఈ మధ్య కాలంలో బాగా ప్రచారంలోకి వచ్చింది చౌక బిర్యానీ.. 99 రూపాయలకే తిన్నంత బిర్యానీ.. 100 రూపాయలకు ఎంత కావాలంటే అంత బిర్యానీ.. గొంగూర పచ్చడి, కట్టా, కలియా అంటూ ఊదరగొడుతున్నారు.. వీధి విధీకో దుకాణం కూడా వెలుస్తోంది. మురికి కాలువల పక్కన, చెత్త కుప్పల పక్కన, ఫుట్ పాత్ ల మీద, ఫ్లైఓవర్ల కిందా, బస్టాండులు, రైల్వే స్టేషన్ల ఎదుట, వైన్ షాపుల ముందు.. ఇలా ఒకటేమిటీ.. పర్లాంగుకో దుకాణమో, పుడ్ స్టాలో, ఫుడ్ వ్యానో కనిపిస్తున్నాయి.
అక్కడ బిర్యానీ బాగుందీ, ఇక్కడ బాగుందంటూ సోషల్ మీడియాలో వీడియోలు హోరెత్తుతుండడంతో, ఏహే.. కానీయ్ వంద రూపాయలే కదా అని కుర్రకారు ఎగబడుతున్నారు. వంద రూపాయలకు చికెన్ బిర్యానీ దొరకడం మంచిదే అయినా అందులో నాణ్యత ఎంత అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లోని ఓ పుడ్ స్టాల్ పై ఆహార శాఖ అధికారులు దాడులు చేసినపుడు.. ఓ బిర్యానీ షాపులో కస్టమర్లు తిని వదిలేసిన ముక్కల్నీ, ఎముకల్ని తిరిగి మళ్లీ బిర్యానీలలో కలిపి వడ్డిస్తున్న విషయం వెలుగు చూసినపుడు కస్టమర్లు అవాక్కయ్యారు. ఇంతటి దుర్మార్గానికి పాల్పడతారా, ఎంత పాపం అని బుగ్గలు నొక్కుకున్నారు. నొసలు చిట్లించారు. ఈ తరహా బిర్యానీలు తిని ఎంతమంది ఇళ్ల దగ్గర బాధ పడుతున్నారో లెక్కలు లేవు గాని తినే ముందు కాస్తంత నాణ్యత, పరిసరాలు, పరిశుభ్రత కూడా చూసుకోవడం ముఖ్యం.
హైదరాబాద్ లోని ఓ పెద్ద పుడ్ స్టాల్ లో ఫుడ్ ఇనస్పెక్టర్లు తనికీలు చేసినపుడు కుళ్లి వాసన వస్తున్న చికెన్, మటన్ ప్యాకెట్లను కనుగొని వాళ్లపై కేసులు పెట్టారు. ఇలా అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. అన్నీ స్టాళ్లు అలా ఉంటాయని కాదు గాని లాభం లేనిదే వ్యాపారం ఉండదని కస్టమర్లు గమనించాలి. మన పేదరికం వారికి లాభం కావొచ్చు గాని మన ఆరోగ్యానికి శాపం కారాదు అన్నదే ఇందులో సూత్రం.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మధ్య కొత్తపెళ్లికొడుకొకరు.. ఈ తరహా బిర్యానీని తాను, తన మిత్రులతో కలిసి తిని ఆస్పత్రి పాలైన సంఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది.
"ఏరా, మామా.. పెళ్లి కుదిరిందిగా పార్టీ ఏమైనా ఉందా లేదా అని తన మిత్రులు అడగడంతో పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత వాంతులు విరేచనాలో ఆస్పత్రి పాలయ్యారు. వంద రూపాయల కోసం చూసుకుంటే లక్షన్నర చేతి చమురు వదిలింది" అని ఆ కొత్త పెళ్లి కొడుకు బంధువొకరు చెప్పారు.
పుట్టినరోజైనా.. పెళ్లిరోజైనా ఇటీవల చాలామంది బిర్యానీ మీద మోజుపడుతున్నారు. పల్లె పట్నం అనే తేడా లేకుండా ఇటీవలి కాలంలో ఎక్కువగా బయట తినేవారి సంఖ్య పెరుగుతోంది. మరికొందరు ఇళ్లకే పార్శిళ్లు తెప్పించుకుని తింటున్నారు. వీరిలో చాలామంది మాంసాహారం, ప్రధానంగా చికెన్ బిర్యానీ వైపు మొగ్గుచూపుతున్నారు.
ఇదే అదనుగా నిర్వాహకులు.. చౌక ధరకు బిర్యానీ అందిస్తున్నారు. ఇందుకోసం నాసిరకం సరకులు, నూనెలు.. ప్రమాదకరమైన రంగులు వాడుతూ ఆహార ప్రియుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
ప్రస్తుతం ప్రతి నగరంలో 99రూపాయల బిర్యానీ బాగా ఫేమస్ అయింది. ఒకప్పుడు కనీసం 250 రూపాయలు పెడితే గాని దొరకని బిర్యానీ ఇవాళ వందకే వస్తోంది. ప్యారడైజ్ లాంటి వాటిల్లోనైతే పన్నులతో కలిపి ఒక బిర్యానీ 450 వరకు ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వీధుల్లో వెలిసిన దుకాణాల్లో బిర్యానీ ధర హోటల్‌ను బట్టి రూ.100 నుంచి రూ.400 వరకు లభిస్తోంది. చాలామంది తక్కువ ధరకు లభిస్తోందని ఎగబడి తినేస్తున్నారు.
అయితే వీటిల్లో ఉపయోగిస్తున్న మాంసం నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అనారోగ్యంతో ఉన్న కోళ్లను కోసి బిర్యానీ సెంటర్లకు తక్కువ ధరకే చికెన్ విక్రయిస్తున్నారు. ఈరోజు అమ్ముడుపోని మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు వంటల్లో వినియోగిస్తున్నారు.
కుర్రకారును ఆకర్షించేందుకు హోటళ్ల వాళ్లు ఈ తరహా చికెన్ తో కలర్ రైస్, చికెన్ బిర్యానీ, చికెన్ లాలిపప్, చికెన్ పకోడి, కోడి కూర, జొన్న రొట్టె, రాగిసంగటి వంటి రకరకాల పేర్లతో విక్రయిస్తున్నారు.
ఇటీవల కోడుమూరులో చికెన్ బిర్యానీలో కల్తీ వస్తువులు ఉపయోగించినట్లు ఆహార భద్రతాధికారుల తనికీల్లో బయటపడింది. రంగులు కలిపి, రోజుల తరబడి ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన మాంసాన్ని వేడిచేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
నగరాల్లోని కొన్ని డాబాల్లో ఈరోజు మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లలో భద్రపరిచి మరుసటి రోజు వేడిచేసి విక్రయిస్తున్నారు. తినే సమయంలో రుచికరంగా ఉన్నా.. తర్వాత ఒకట్రెండు రోజుల్లో దాని విషప్రభావం బయటపడుతుంది.
నాసిరకం.. ప్రమాదకరం..
కొన్ని బిర్యానీ సెంటర్లలో తక్కువ ధరకు దొరికే అనారోగ్యకరమైన కోడి మాంసంతో పాటు పాతపడిన బాస్మతి బియ్యం, పామాయిల్, నాసిరకం, సరకులు, రసాయనిక రంగులు, టేస్టింగ్ సాల్ట్, తక్కువ ధరకు దొరికే అల్లంవెల్లుల్లి పేస్టు వినియోగిస్తున్నారు.
టేస్టింగ్ సాల్ట్ ఎక్కువగా వాడిన ఆహార పదార్థాలను తరచూగా తినడంవల్ల పేగులకు రంధ్రాలుపడే ప్రమాదం ఉంది.
ఇక బిర్యానీకి ఆకర్షణీయమైన రంగు వచ్చేందుకు కృత్రిమ రంగులను వినియోగిస్తున్నారు. దీనివల్ల తిన్నవారు క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉంది.
అనారోగ్యకరమైన చికన్, ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో పెట్టిన మాంసంతో వండిన ఆహార పదార్థాలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ బారినపడే ఆస్కారముంది. ఇది ప్రాణాలకే ప్రమాదం.
నాణ్యత పాటించకపోతే చర్యలు
మాంసాన్ని నిర్ణీత ప్రమాణాల మేరకు నిల్వ చేయాలి. చాలామంది సాధారణంగా ఫ్రిజ్‌లో పెట్టేసి రోజుల తరబడి నిల్వ చేస్తున్నారు. దీనివల్ల కొన్ని గంటల్లోనే మాంసం చెడిపోతోంది. దానితో వంటలు చేస్తే విషమంగా మారే ప్రమాదం ఉంది. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్ల వారికి జరిమానా విధించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆహార భద్రతాధికారులు చెబుతున్నా ప్రమాణాలు పాటిస్తున్న వారు తక్కువే.
ఇలా ఫిర్యాదు చేయొచ్చు
జిల్లాలో ఎక్కడైనా కల్తీ, నాసిరకం, నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే ఆహార భద్రతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మీరు ఎవరికి ఫిర్యాదు చేయాలనుకుంటే వాళ్లకి చేయవచ్చు.
జాతీయ స్థాయి హెల్ప్‌లైన్ (FSSAI)
టోల్ ఫ్రీ నంబర్: 1800-11-2100(ఇది భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) జాతీయ హెల్ప్‌లైన్)
ఆన్‌లైన్ ఫిర్యాదు
FSSAI కి Food Safety Connect యాప్, వెబ్‌సైట్ ఉంది. https://foscos.fssai.gov.in/consumergrievance
అక్కడ మీరు మీ ఫిర్యాదును నేరుగా నమోదు చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం
ప్రతి జిల్లాలో Designated Officer (Food Safety) ఉంటారు. మీరు జిల్లా కలెక్టర్ కార్యాలయం లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో Commissioner, Deputy Controller, Public Analyst వంటి అధికారులకు నేరుగా ఫోన్ చేయవచ్చు. అలాగే, 040-21111111 అనే హెల్ప్‌లైన్ నెంబర్ ఉంది.
రాష్ట్ర స్థాయి అధికారుల వివరాలు-Commissioner of Food Safety, Telangana
R. V. Karnan, IAS – ఆహార భద్రతా కమిషనర్;
Deputy Food Controller: T. Vijaya Kumar – నెంబరు- 9100105795; ఇమెయిల్: telanganacfs@gmail.com
Chief Public Analyst: G. Laxmi Narayan Reddy – 9492535201; ఇమెయిల్: sflfssaihyd@gmail.com
హైదరాబాదు ప్రత్యేక సమాచారం (పబ్లిక్ హెల్ప్‌లైన్):
నగర పౌరులు 040‑21111111 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చు.
ఆంధ్రప్రదేశ్ (Food Safety Mitra)జిల్లా స్థాయి వివరాలు –
Guntur- Pavani Jonnala 9052486666
Krishna- Naveena Kadiyala 9705992027
Prakasam- DINESH NARALASETTY 9849427424
West Godavari- Vanka Dinesh Ratnakar 7989327415
East Godavari- Chinni Prasad Cheepulla 9948847556
Visakhapatnam- Harish Sirla 8555084405
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)
**Commissioner of Food Safety**
Smt. Sujata Sharma, IAS
కార్యాలయం: Directorate of Institute of Preventive Medicine, Public Health Labs & Food (Health) Administration, Himagna Towers, ‘B’ Block, 5th Floor, Flat Nos. 502‑504, Old NRI College Building, Saipuram Colony, Gollapudi, Vijayawada (Krishna District)
టెలిఫోన్: 08662‑410295
ఈ‑మెయిల్: peshichfw@gmail.com, cfwhyd@yahoo.కం
(ఇది ఇంటర్నెట్ నుంచి తీసుకున్న సమాచారం.. ఏదైనా తప్పు ఉంటే నేరుగా ఆరోగ్య శాఖను సంప్రదించి సరిచూసుకోగలరు)
Next Story