ట్రంప్ పదవీ స్వీకారానికి ఆంధ్రా తెలుగోడికి ఆహ్వానం
x

ట్రంప్ పదవీ స్వీకారానికి ఆంధ్రా తెలుగోడికి ఆహ్వానం

ఎవరా తెలుగు వాడు, ఏమా కథ?


అద్దంకి పట్టణం కాకానిపాలెం నకు చెందిన జర్నలిస్ట్ సందిరెడ్డి కొండలరావు కుమారుడు సందిరెడ్డి సుఖేష్ కు ఈనెల 20వ తేదీన వాషింగ్టన్ డిసి లో జరగనున్న అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ జె ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం అందింది. ఈ మేరకు సుఖేష్ ని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ట్రంప్ వాన్స్ ఇనాగరల్ కమిటీ ఆహ్వానం పంపిది. సుఖేష్ గత రెండు సంవత్సరాలుగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ లా కళాశాలలో న్యాయ శాస్త్రం లో విద్యను అభ్యసించారు. సుఖేష్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరఫున రిపబ్లిక్ పార్టీ ఎన్నికల స్ట్రాటజీ కమిటీలో మెంబర్ గా ఉండి ట్రంప్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ట్రంప్ ఫోర్స్ 47 వివేక్ రామస్వామి బృందంలో పనిచేశారు.

అమెరికా అధ్యక్షుని ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరయ్యేందుకు అరుదైన అవకాశం అద్దంకి చెందిన సుఖేష్ కు దక్కటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. సందిరెడ్డి కొండలరావు సీనియర్ జర్నలిస్ట్. కొంతకాలం వార్త, మరికొన్ని పత్రికల్లో పనిచేసి తరువాత సొంతగా ‘గుండ్లకమ్మ’ పత్రిక స్థాపించారు. మంత్లీ మాగజైన్ ప్రతి నెలా క్రమం తప్పకుండా అచ్చు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఆప్తులను సంపాదించారు. తన కుమారుడు అమెరికా ఎన్నికల్లో ట్రంప్ తరపున స్ట్రాటజీ కమిటీలో సభ్యుడుగా ఉండటం సంతోషంగా ఉందని తెలిపారు. మారు మూల ప్రాంతం నుంచి వెళ్లి ఉన్నత స్థాయికి తన కుమారుడు ఎదగటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.


Read More
Next Story