BRS|బీఆర్ఎస్ ను ఎవరూ పట్టించుకోవటంలేదా ?
రెండు కూటములే కాదు తటస్తంగా ఉండే మరికొన్ని పార్టీలు కూడా కారుపార్టీని కలుపుకుని పోవటంలో పెద్దగా ఆసక్తి చూపటంలేదు.
న్యూఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదేఅనుమానం పెరిగిపోతోంది. రాజ్యసభ(Rajya Sabha)లో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి చెప్పిన మాటలు పై అనుమానాన్ని మరింతగా పెంచేస్తోంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ Rajya Sabha Chairman Jagdeep DhanKhad) పై ఇండియా కూటమి(INDIA) అవిశ్వాస తీర్మానాన్ని(No confidence Motion) ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మానంపై ఇండియా కూటమి ఇచ్చిన నోటీసును రాజ్యసభ సెక్రటేరియట్ పరిశీలిస్తోంది. ఒకవేళ అవిశ్వాస తీర్మానం నోటీసు ఆమోదంపొందితే అందుకు రాజ్యసభ సెక్రటేరియట్ ఒకతేదీని ప్రకటిస్తుంది. సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య అవిశ్వాసంపై చర్చలు జరుగుతుంది. ఆ తర్వాత అవసరమైతే ఓటింగ్ కూడా జరగుతుంది. చర్చలవరకు బలాబలాల ప్రస్తావన ఉండదు. ఎప్పుడైతే చర్చల తర్వాత వ్యవహారం ఓటింగ్ కు చేరుకుంటుందో అప్పుడు బలాబలాల అవసరం వస్తుంది.
ఇదే విషయమై కేఆర్ సురేష్ మాట్లాడుతు తాము రెండుకూటములకు సమదూరాన్ని పాటించబోతున్నట్లు చెప్పారు. అవిశ్వాస తీర్మానం నోటీసు, చర్చలు, ఓటింగ్ అంశాల్లో బీఆర్ఎస్(BRS) తలదూర్చటంలేదన్నారు. ఇండియా కూటమి, ఎన్డీయే(NDA) విషయంలో ఇప్పుడు ఏదైతే విధానం అనుసరిస్తున్నామో భవిష్యత్తులో కూడా ఇదే పద్దతిలో సమదూరం పాటించాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. మొదటినుండి కూడా తమ పార్టీ రెండు కూటములకు సమదూరంగానే ఉన్నట్లు కేఆర్ గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఎప్పుడు కూడా సభలో ప్రజాసమస్యల చర్చకు, పరిష్కారానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అయితే రెండుకూటములమధ్య సభలో జరగుతున్న ఆధిపత్యం గొడవల్లో ప్రజాసమస్యలు ప్రస్తావనకు రావటంలేదని కేఆర్ అసంతృప్తి వ్యక్తంచేశారు.
కేఆర్ చెప్పింది బాగానే ఉందికాని ఇంతకీ అసలు విషయం ఏమిటంటే అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేయమని బీఆర్ఎస్ ను ఇండియా కూటమి అడగనే లేదు. కూటమిలోని పార్టీలే కాకుండా తటస్తంగా ఉన్న మరికొన్ని పార్టీల మద్దతు కోసం సంప్రదించిన కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ ను మాత్రం పట్టించుకోలేదు. నోటీసులో సంతకం చేయమనీ బీఆర్ఎస్ ను అడగలేదు, అవసరమైతే ఓట్లువేయాలని మద్దతుకూడా కోరలేదు. ఇపుడే కాదు చాలాకాలంగా బీఆర్ఎస్ ను పై రెండు కూటములు పట్టించుకోవటంలేదు. పై రెండు కూటములే కాదు తటస్తంగా ఉండే మరికొన్ని పార్టీలు కూడా కారుపార్టీని కలుపుకుని పోవటంలో పెద్దగా ఆసక్తి చూపటంలేదు. కారణం ఏమిటంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పై నమ్మకం లేకే. కేసీఆర్ ఏ రోజు ఎలాగుంటారో ఎవరూ ఊహించలేరు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రకటించి ప్రధానమంత్రి రేసులో తాను కూడా ఉన్నానని గతంలోనే ప్రకటించారు. అప్పట్లో ఎన్టీయే, యూపీయే కూటములకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమిని ఏర్పాటుచేయాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ(Mamata Benarji), తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్రలో శరద్ పవార్(Sarad Pawar), కర్నాటకలో దేవేగౌడ, కుమారస్వామి, జార్ఖండ్ లో హేమంత్ సోరేన్(Hemanth Soren), ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళతో చాలాసార్లు భేటీ అయ్యారు. వాళ్ళతో చర్చలు ఏమయ్యాయో ఏమో తెలీదు కాని కేసీఆర్ ప్రయత్నాలు అయితే ఫెయిలయ్యాయి. దాని తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటం, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లలో ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలవలేదు. దాంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పటంకాదు కనీసం పట్టించుకునే దిక్కే లేకుండాపోయింది.
రాజకీయాల్లో రాణించాలంటే పవర్ ఉండి తీరాల్సిందే. అందునా జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పాలంటే నంబర్ గేమ్ చాలా అవసరం. చేతిలో ఎంపీ సీట్లుంటేనే ఎవరైనా గుర్తిస్తారన్న విషయాన్ని కేసీఆర్ మరచిపోయారు. ఇపుడు రాజ్యసభ ఛైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది కూడా ఇండియా కూటమి గెలుస్తుందని కాదు. కాకపోతే ఇండియా కూటమిలోని పార్టీలతో పాటు ప్రతిపక్షాల విషయంలో ధన్ ఖడ్ అనుసరిస్తున్న వైఖరికి నిరసన తెలపటమే. అవిశ్వాస తీర్మానం నోటీసు ఆమోదంపొందటమే ఇపుడు చాలా గొప్ప.
రాజ్యసభలోని 234 మంది సభ్యుల్లో ఎన్డీయే బలం 119. ఇండియా కూటమికి ఉన్న బలం 85 మాత్రమే. తటస్తంగా మరో 15 మంది ఎంపీలుంటే ఉండవచ్చు. ఏ విధంగా చూసుకున్నా అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశంలేదు. అయినా సరే బీఆర్ఎస్ మద్దతును ఇండియా కూటమి అడగలేదంటే పరిస్ధితి ఎలాగుందో అర్ధమవుతోంది. కేఆర్ సురేష్ మాట్లాడుతు ‘తమను సంతకాలు చేయమని ఎవరూ అడగలేదు’ అని చెప్పటంలోనే అర్ధమైపోతోంది బీఆర్ఎస్ ను ఎవరూ పట్టించుకోవటంలేదని.