Blow to KTR|కేటీఆర్ కి హైకోర్టులో రెండో దెబ్బ
తనను ఏసీబీ(ACB) విచారించేటపుడు తనలాయర్ పక్కనేఉండాలని వేసిన కేసులో కూడా బుధవారం కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.
కారుపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిస్ధితి ఏమిటో అర్ధంకావటంలేదు. మిగిలిన వాళ్ళ సంగతిని వదిలేసినా కేటీఆర్ కైనా తన పరిస్ధితి అర్ధమవుతోందా అనే సందేహాలు పెరిగిపోతున్నది. కారణం ఏమిటంటే హైకోర్టు(High court)లో కేటీఆర్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తనపైన ఏసీబీ కేసునమోదు చేయటాన్ని వ్యతిరేకిస్తు కేటీఆర్(KTR) వేసిన కేసును మంగళవారం హైకోర్టు కొట్టేసింది. అలాగే తనను ఏసీబీ(ACB) విచారించేటపుడు తనలాయర్ పక్కనేఉండాలని వేసిన కేసులో కూడా బుధవారం కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. విచారణకు లాయర్ ను అనుమతించాలని చెప్పిన కోర్టు విచారణ గదిలోకి మాత్రం లాయర్ ఎంటర్ కాకూడదని షరతు విధించింది. అలాగే, విచారణసందర్భంగా తనతో తీసుకెళ్ళబోయే లాయర్ పేరును ముందే చెప్పాలని కూడా చెప్పింది. అసలు ఏసీబీ విచారణ సమయంలో లాయర్ ను అనుమతించే అవకాశం ఏసీబీ చట్టంలో ఉందాని హైకోర్టు అడిగింది. పనిలోపనిగా కేటీఆర్ పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందా ? అనే సందేహం కూడా వ్యక్తంచేసింది.
హైకోర్టు ఇటు కేటీఆర్ విషయంతో పాటు అటు అడ్వకేట్ జనరల్ కు సంధించిన ప్రశ్నలతో బీఆర్ఎస్ నేతల్లో అయోమయం పెరిగిపోతోంది. విచారణకు కేటీఆర్ లాయర్ ను అనుమతించిన కోర్టు విచారణ గదిలో కేటీఆర్-ఏసీబీ అధికారులు మాత్రమే ఉండాలని ఆదేశించటంతో నేతలకు షాక్ కొట్టినట్లయ్యింది. దాంతో కేటీఆర్ దాఖలుచేసిన పిటీషన్ను కోర్టు తోసిపుచ్చినట్లుగానే అనుకోవాలి. ఇదే విషయమై మొన్నటి 6వ తేదీన కేటీఆర్ ఎంత గోలచేశారో అందరూ చూసిందే. విచారణ సమయంలో తనతో పాటు లాయర్ ను ఉంచుకోవటం తన ప్రాధమిక హక్కని కేటీఆర్ గోలగోల చేశారు. విచారణలో తనతో పాటు తన లాయర్ ను అనుమతించేందుకు ఏసీబీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నల మీద ప్రశ్నలతో రెచ్చిపోయారు.
రేవంత్ రెడ్డి(Revanth reddy)ని వ్యక్తిగతంగానే కాకుండా పోలీసులపైన కూడా కేటీఆర్ 6వ తేదీన ఓ రేంజిలో మండిపోయారు. లాయర్ ను అనుమతించాలన్న డిమాండ్ సందర్భంగా ఆరోజు కేటీఆర్ చెప్పింది నిజమే అయితే మరీరోజు హైకోర్టు ఎందుకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది ? విచారణ గదిలో కేటీఆర్, ఏసీబీ ఉన్నతాధికారులు మాత్రమే ఉండాలని కేటీఆర్ కు స్పష్టంగా హైకోర్టు తేల్చిచెప్పింది. తన లాయర్ ను అనుమతించాలనే డిమాండుపై రేవంత్ ను, పోలీసులను నానా మాటలన్న కేటీఆర్ ఈరోజు ఎందుకని కోర్టును నిలదీయలేదు. ఆరోజు కూడా విచారణకు లాయర్ ను అనుమతించేదిలేదని ఏసీబీ అధికారులు చెప్పినపుడు కేటీఆర్ పోలీసులపై విరుచుకుపడ్డారు. మరీరోజు హైకోర్టు తీర్పునేపధ్యంలో ఎక్కడా చప్పుడు చేయటంలేదు. దాంతో కేటీఆర్ తో పాటు విచారణ సందర్భంగా వేరేగదిలో కూర్చోబోయే లాయర్లపేర్లను కాసేపటిలో కోర్టుకు అందించబోతున్నారు. లాయర్ ను అనుమతించాలన్న వాదనను కోర్టు కొట్టేసింది కాబట్టి కేటీఆర్ వాదనంతా ఉత్త డొల్లే అని అర్ధమవుతోంది.