రోడ్డు ప్రమాదంలో డాక్టర్, కుమార్తె మృతి
x

రోడ్డు ప్రమాదంలో డాక్టర్, కుమార్తె మృతి

బాధిత కుటుంబం ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు బంధువులు.


పల్పాడు జిల్లాలో దారుణమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో తిరుపతికి చెందిన ఓ వైద్యుడు, అతని ఏడేళ్ల కూమార్తె ప్రాణాలు పోగొట్టుకున్నారు. తిరుపతిలో వైద్యుడిగా, స్విమ్స్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న తంగేళ్ల వెంకట కిషోర్‌ తన కుటుంబ సభ్యులతో గుంటూరు వైపు బయలు దేరారు. ఏడుగురు కుటుంబ సభ్యులతో కారులో బయలు దేరారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి ప్రాంతానికి చేరుకునే సరికి జాతీయ రహదారిపై కారు ప్రమాదానికి గురైంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కారును నడుపుతున్న డాక్టర్‌ తంగేళ్ల వెంకటకిషోర్, ఆయన కుమార్తె అశ్వినందనలు మృత్యువాత పడ్డారు. వెంకట కిషోర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి మృత్యువాత పడగా, అతని కుమారెత్త అశ్వినందన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కారులో ప్రయాణిస్తున్న తక్కిన వారికి గాయాలు కాగా వారికి చిలకలూరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు.

అయితే ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్న వైద్యుడు తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు బంధువు కావడంతో సమచారం తెలిసిన వెంటనే ఆయన చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించాడు. మృతి చెందిన డాక్టర్‌ వెంకటకిషోర్‌ తిరుపతిలోని స్విమ్స్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తుండగా ఆయన భార్య సంధ్య యాదవ్‌ కూడా వైద్యురలుగా ఉన్నారు.

Read More
Next Story