ముఖ్యమంత్రుల జీతాలు ఎంతో తెలుసా?
ముఖ్యమంతులకు కూడా నెల వారీగా ఆయా ప్రభుత్వాలు జీతాలు చెల్లిస్తున్నాయి. కొంత మంది సీఎంలు జీతాలు తీసుకోకుండా పని చేయగా, హంగూ, ఆర్భాటం లేకుండా పని చేసిన వారు కూడా ఉన్నారు.
ముఖ్యమంత్రులకు ప్రభుత్వాలు జీతాలు చెల్లిస్తాయి. జీతాలు ఎంత మొత్తంలో ఉండాలి అనేది ఆయా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై ఆధార పడి ఉంటుంది. ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బట్టి ఎంత వరకైనా పెంచుకో వచ్చు. ఎంత వరకైనా తగ్గించుకోవచ్చు. ఆ వెసులుబాటు మాత్రం ఆయా ప్రభుత్వాలకు ఉంటుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీతం తీసుకోకుండా పని చేసి రికార్డు నెలకొల్పారు. నెలకు కేవలం ఒక్క రూపాయి జీతంగా తీసుకొని పని చేశారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రులు మాణిక్ సర్కార్, సృపసేన్ చక్రవర్తి, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గోవా మాజీ ముఖ్మమంత్రి మనోహర్ పార్కిర్ వంటి నేతలు పదవిలో ఉన్నంత కాలం ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా అతి సామాన్య జీవితాన్ని గడిపారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కువ మొత్తంలో జీతం తీసుకునే ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పారు. తెలంగాణ ముఖ్యమంత్రికి నెలకు రూ. 4లక్షల 10వేలు జీతం కింద చెల్లిస్తున్నారు. తర్వాత అత్యధిక జీతం తీసుకునే ముఖ్యమంత్రిగా ఢిల్లీ సీఎం ఉన్నారు. ఢిల్లీ ముఖ్మమంత్రికి రూ. 3.90లక్షల వరకు నెలకు జీతంగా చెల్లిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అత్యధికంగా జీతాలు తీసుకునే ముఖ్యమంత్రుల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్మమంత్రికి రూ. 3.35లక్షల వరకు నెలకు జీతం చెల్లిస్తున్నారు.
అతి తక్కువ జీతం తీసుకునే ముఖ్యమంత్రులుగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు చెందిన నేతలు జాబితాలో ఉన్నారు. త్రిపుర ముఖ్యమంత్రి దేశంలో అందరి ముఖ్యమంత్రుల కంటే తక్కువ జీతం తీసుకునే సీఎంగా నిలచారు. రూ. 1లక్ష 5వేలు నెలకు జీతంగా తీసుకుంటున్నారు. తక్కిన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తక్కువ జీతం తీసుకుంటున్న వారి జాబితాలో నిలచారు. రూ. 1.50లక్షల నుంచి రూ. 1.10లక్షల వరకు తీసుకుంటున్నారు.
రాష్ట్రం ముఖ్యమంత్రి వేతనం
తెలంగాణ 4లక్షల 10వేలు
ఢిల్లీ 3లక్షల 90 వేలు
ఉత్తరప్రదేశ్ 3లక్షల65వేలు
మహారాష్ట్ర 3లక్షల 40 వేలు
ఆంధ్రప్రదేశ్ 3లక్షల 35వేలు
గుజరాత్ 3లక్షల 21వేలు
హిమాచల్‌ప్రదేశ్ 3లక్షల 10వేలు
హర్యానా 2లక్షల 88వేలు
ఝార్ఖండ్ 2లక్షల 72 వేలు
మధ్యప్రదేశ్ 2లక్షల 55వేలు
ఛత్తీస్‌గఢ్ 2లక్షల 30వేలు
పంజాబ్ 2 లక్షల 30వేలు
గోవా 2లక్షల 20 వేలు
బీహార్ 2లక్షల 15వేలు
పశ్చిమబెంగాల్ 2లక్షల 10వేలు
తమిళనాడు 2లక్షల 5వేలు
కర్నాటక 2లక్షలు
సిక్కం 1లక్ష 90 వేలు
కేరళ 1 లక్ష 85 వేలు
రాజస్థాన్ 1 లక్ష 75 వేలు
ఉత్తరాఖండ్ 1 లక్ష 75 వేలు
ఒడిశా 1 లక్షల 60 వేలు
మేఘాలయ 1 లక్ష 50 వేలు
అరుణాచల్ ప్రదేశ్ 1 లక్ష 33 వేలు
అసోం 1లక్ష 25వేలు
మణిపూర్ 1 లక్ష 10 వేలు
నాగాలాండ్ 1 లక్ష 10 వేలు
త్రిపుర 1 లక్ష 5వేలు
Next Story