అసెంబ్లీలో సెల్‌ఫోన్లు మాట్లాడొద్దు
x

అసెంబ్లీలో సెల్‌ఫోన్లు మాట్లాడొద్దు

కొంత మంది సభ్యులు సభ జరుగుతున్న సమయాల్లో సెల్‌ మాట్లాతున్నారు.


అందరూ ప్రజా ప్రతినిధులే. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో కూర్చుని రాష్ట్ర ప్రజలకు కావలసిన చట్టాలు చేసే ఎమ్మెల్యేలే. అయినప్పటికీ అసెంబ్లీ సమావేశాలు జరగుతున్న సమయంలో సభలోకి ప్రవేశించిన తర్వాత సభను గౌరవించాలి. మర్యాదలను పాటించాలి. అందులో భంగా సభ జరుగుతున్న సయమంలో సెల్‌ ఫోన్లు మాట్లాడకుండా సభా మర్యాదలను కాపాడుతూ హుందాగా వ్యవహరించాలని కానీ కొంత మంది సభ్యులు వాటిని పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. సభ జరుగుతున్న సమయాల్లో సెల్‌ ఫోన్లు మాట్లాడుతూ సభా మర్యాదలకు అగౌరవం కలిగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు సెల్‌ఫోన్ల మీద సోమవారం సూచనలు చేశారు. సభ జరుగుతున్న సమయంలో సభ్యులు సెల్‌ ఫోన్లు మాట్లాడటంపై స్పందించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభ జరుగుతున్న సమయంలో సభ లోపల సెల్‌ ఫోన్లు మాట్లాడొద్దని సభ్యులకు కీలక సూచనలు చేశారు. సభ సజావుగా సాగుతున్న సమయంలో కొంత మంది సభ్యులు సభలోనే సెల్‌ ఫోన్లు మాట్లాడుతున్నారని ఇది సరైన పద్దతి కాదని, దీని వల్ల చర్చలు సరిగా జరిగే అవకావం ఉండదన్నారు.
సభా మర్యాదలు కాపాడుకోవలసి బాధ్యత ప్రతి సభ్యుడిపైన ఉందన్నారు. సభ జరుగుతున్న సమయంలో సభ్యులు తమ సెల్‌ ఫోన్లను సైలెంట్‌లో పెట్టుకోవాలని సూచించారు. దీనిపై సభ్యులు కోప్పడొద్దని, ఇది విజ్ఞప్తి మాత్రమే అని చెబుతూనే.. విజ్ఞప్తులు ఒకటి, రెండు సార్లు మాత్రమే ఉంటాయని తనదైన శైలిలో డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజు ఇన్‌డైరెక్టుగా సభ్యులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సమయంలో సీనియర్‌ శాసన సభ్యుడు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు లేచి అసెంబ్లీలో జామర్లు పెట్టాలని కోరారు. దీనికి డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు సమాధానం చెబుతూ సభ్యుల బలహీనతలను జామర్లపైకి నెట్టొద్దని బదులిచ్చారు.
Read More
Next Story