రామ్‌గోపాల్‌ వర్మను అప్పటి వరకు అరెస్టు చేయొద్దు-ఏపీ హైకోర్టు ఆదేశాలు
x

రామ్‌గోపాల్‌ వర్మను అప్పటి వరకు అరెస్టు చేయొద్దు-ఏపీ హైకోర్టు ఆదేశాలు

పోలీసుల విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించిన హైకోర్టు తాజా మరో ఆదేశాలు జారీ చేసింది.


ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా సంచలనంగా మారిన సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై సోషల్‌ మీడియా కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్‌ పిటీషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రామ్‌గోపాల్‌ వర్మను సోమవారం వరకు అరెస్టు చేయొద్దని పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

అయితే గతంలో జారీ చేసిన ఆదేశాల కంటే ఈ సారి భిన్నంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది. తనపై నమోదైన కేసుల నుంచి తనను రక్షించాలని, పోలీసులు తనను అరెస్టు చేయకుండా చూడాలని, తనపై కేసులు నమోదు కాకుండా చూడాలని ఇది వరకు రామ్‌గోపాల్‌ వర్మ హై కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు పోలీసుల విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొంది. అరెస్టు అయిన తర్వాత మధ్యంతర బెయిల్‌ కోసం పిటీషన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా మరో సారి హైకోర్టును ఆశ్రయించారు. తన మీద కేసులు పెట్టిన అధికారులందరిని ప్రతి వాదులుగా చేర్చుతూ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు సోమవారం వరకు రామ్‌గోపాల్‌ వర్మను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించినట్లు తెలిసింది.


Read More
Next Story