డిఎన్ఏ పరీక్షలు పూర్తి- మృతదేహాల అప్పగింత
x

డిఎన్ఏ పరీక్షలు పూర్తి- మృతదేహాల అప్పగింత

బస్సు ప్రమాదంలో మరణించిన ఒకరి ఐడెంటిఫికేషన్ ఇంకా తెలియాల్సి ఉంది.


వడ్ల శ్రీకాంత్

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన 19 మందిలో 18 మందికి మందికి డిఎన్ఏ పరీక్షలు పూర్తయ్యాయి. ఒకరి ఐడెంటిఫికేషన్ ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాద మృతుల్లో గుర్తించిన 18 మందికి గాను 16 మంది బంధువుల నుంచి డిఎన్ఏ సేకరించి పరీక్ష నిమిత్తం మంగళగిరిలో ఉన్న స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. మరో ఇద్దరి మృతుల బంధువులు మంగళగిరిలోనే వారి డీఎన్ఏ ను ఇవ్వడం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరుగగా అదే రోజు రాత్రి రెండు గంటల దాకా డాక్టర్లు 16 బృందాలుగా ఏర్పడి మృతదేహాలు డిఎన్ఏ ను, మృతుల బంధువుల డీఎన్ఏ ను సేకరించారు. అదే రోజు పరీక్షలు నిమిత్తం మంగళగిరి ల్యాబ్ కు పంపించగా, ఈరోజు ఉదయం 8 గంటలకు డీఎన్ఏ లకు సంబంధించిన రిపోర్ట్స్ రావడంతో అధికారులు మృతదేహాల అప్పగింత కార్యక్రమాన్ని ప్రారంభించారు. మృతదేహాల తరలింపు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంబులెన్స్ లను ఏర్పాటు చేసినట్టుగా అధికారులు తెలిపారు.

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ డిఎన్ఏ రిపోర్టుల మ్యాచింగ్ ప్రకారం మృతదేహాలను వారి వారి బంధువులకు అందజేస్తున్నట్టుగా తెలిపారు. మృతదేహాలతో పాటు డిఎన్ఏ రిపోర్ట్స్ పోస్టుమార్టం రిపోర్ట్ సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా మృతుల బంధువులకు అందజేసినట్టు ఎస్పీ తెలిపారు. 19 మంది మృతికి కారణమైనటువంటి బస్సు ప్రమాదంపై కూలంకషంగా విచారణ చేపట్టినట్టుగా అని తెలిపారు. విచారణలో రోజురోజుకు కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయని ఎస్పి వివరించారు. ప్రస్తుతం బైకు రోడ్డు మీద పడి ఉండడం వల్లనే దానిని గమనించకుండా బస్సు డ్రైవరు ఢీకొట్టి ఈడ్చుక పోవడం వల్ల వచ్చిన మంటల వల్లే ప్రమాదం సంభవించినట్టుగా నిర్ధారణకు వచ్చామన్నారు. బైకర్ శివశంకర్ మద్యం సేవించి తన మిత్రునితో కలిసి డోన్ వైపు వెళ్తుండగా డివైడర్ కు గుద్దుకుని మరణించడం జరిగిందని ఎస్పీ వివరించారు. శివశంకర్ తో పాటు ఉన్నటువంటి ఉన్న అతని మిత్రుడు ఎర్రిస్వామి కూడా విచారించగా ఇదే విషయం చెప్పారని ఆయన తెలిపారు. బైక్ ఆక్సిడెంట్ కు బస్సు ప్రమాదానికి మధ్య సమయంలో కొన్ని వాహనాలు అటుగా వెళ్ళాయని వారిని కూడా గుర్తించి విచారించనున్నట్టు ఎస్పీ తెలిపారు.

Read More
Next Story