25న మెగా డీఎస్సీ 2025 నియామక పత్రాల పంపిణీ
x

25న మెగా డీఎస్సీ 2025 నియామక పత్రాల పంపిణీ

గురువారం సాయంత్రం సచివాలయం వద్ద కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందిస్తారు.


ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ 2025లో ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు (మొత్తం 16,347 పోస్టులలో) నియామక పత్రాలు (appointment letters) అందజేసే కార్యక్రమం 25 సెప్టెంబర్ 2025 గురువారం అమరావతిలోని సచివాలయం వద్ద జరుగనుంది. ఈ కార్యక్రమం సాయంత్రం మూడు గంటలకు నిర్వహిస్తారు.

కార్యక్రమ వివరాలు

రాష్ట్ర స్థాయి ప్రభుత్వ కార్యక్రమాల సాధారణ షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా వాతావరణ ప్రభావం వల్ల ఇది సాయంత్రం 3 గంటలకు జరుగుతుంది.

అమరావతి సచివాలయం సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రధాన విశేషాంశాలు

ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రత్యేకంగా ఎంపికైన 22 మంది (సబ్జెక్టు టాపర్లు, INSPIRE అవార్డు విజేతలు)కు నియామక పత్రాలు అందజేస్తారు.

మిగిలిన అభ్యర్థులు జిల్లా వారీగా అమర్చిన కౌంటర్ల నుంచి పత్రాలు స్వీకరిస్తారు.

34,000 మంది (అభ్యర్థులు, కుటుంబాలు) కోసం సీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రాంతాల వారీగా (రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర) జోన్లు ఏర్పాటు చేశారు. రవాణా, భోజనం, భద్రత వంటి ఏర్పాట్లు చేశారు.

మొదట సెప్టెంబర్‌ 19న షెడ్యూల్ చేసిన కార్యక్రమం వర్షాల కారణంగా 25నకు మార్చారు. అయితే 25న కూడా చల్లిని వాతావరణం ఉంది. ఉదయం తుప్పర్ల వర్షం కురిసింది. ఉఫాన్ ప్రాభావం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. తుది ఎంపిక జాబితా 12 సెప్టెంబర్‌న విడుదలైంది.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న ఉపాధ్యాయులను ఉద్దేశించి సందేశం ఇస్తారు.

Read More
Next Story