దూరం 33 కి.మీ... చార్జీ రూ. 110లు
x

దూరం 33 కి.మీ... చార్జీ రూ. 110లు

విజయవాడ-గుంటూరు ఏసీ బస్ చార్జీ మోయలేని భారమని ప్రయాణికులు అంటున్నారు.


విజయవాడ నుంచి గుంటూరుకు ఏసీ, నాన్ ఏసీ బస్ లు ఎక్కువగానే తిరుగుతుంటాయి. ఆర్డినరీ బస్ ల్లో చార్జీ రూ. 50లు గా వుంది. ఎక్స్ ప్రెస్ బస్ ల్లో రూ. 60 నుంచి 70లు మధ్య ఉంది. నాన్ స్టాఫ్ట్ బస్ ల్లో రూ. 70లు తీసుకుంటున్నారు. నిత్యం ఆరు ఏసీ బస్ లు విజయవాడ-గుంటూరు మధ్య తిరుగుతున్నాయి. ఈ బస్ ల్లో రూ. 100లు చార్జీ తీసుకుంటున్నారు.


గరుడ ఏసీ బస్ లో రూ. 110లు తీసుకుంటున్నారు. కేవలం 33 కిలో మీటర్ల దూరానికి ఇంత మొత్తం చార్జీ తీసుకోవడం ఏమిటని పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. కిలో మీటరుకు సుమారు రూ. 3.50 ల లెక్కన వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ కార్ల వాళ్లు నాన్ ఏసీ అయితే 80రూపాయలు, ఏసీ అయితే రూ. 100లు తీసుకుంటున్నారు. కానీ ఏసీ గరుడ బస్ వారు ఏకంగా రూ. 110లు తీసుకోవడం చర్చనియాంశంగా మారింది.

ఏపీలో రెండు రకాల ఏసీ బస్ లు, రెండు రకాల నాన్ ఏసీ బస్ ల్లో తెలంగాణ ప్రభుత్వం 15 నుంచి 25 శాతం వరకు బస్ చార్జీలు తగ్గించింది. ఏపీలో బస్ చార్జీలు తగ్గకపోగా పెరగటం విశేషం.

Read More
Next Story