
మహిళలపై వివక్షను అరికట్టాలి
మహిళల పట్ల గౌరవంగా వ్యవరించాలని, అదే నిజమైన నాగరికత కలిగిన సమాజానికి పునాది అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
మహిళలపై లింగ వివక్క్షను అరికట్టాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సినిమాలు, సీరియల్స్‌లో మహిళల పట్ల చిన్న చూపు చూసేలా, వారిని అవమానానికి గురి చేసేలా చిత్రీకరించడాన్ని, మహిళల మనోభాలు దెబ్బతినే విధంగా, వివక్షను ప్రదర్శించే విధంగా సంభాషణలు ఉండటాన్ని నివారించాలని, అలాంటి పోకడలను అరికట్టాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహిళల పట్ల ఎలాంటి వివక్ష లేకుండా, అవమానకరమైన సంభాషణలు లేకుండా సినిమాలు, సీరియళ్లు తీయాలని పేర్కొన్నారు. మహిళల పట్ల గౌరవంగా వ్యవరించాలని, అదే నిజమైన నాగరికత కలిగిన సమాజానికి పునాది అని లోకేష్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
లోకేష్ ఏమన్నారంటే..
మహిళల పట్ల గౌరవం నిజంగా నాగరిక సమాజానికి పునాది. ఇంట్లో మన పిల్లలు చూసే విధంగా సీరియళ్లు, సినిమాలు తీయాలన్నారు. అలాంటివి పిల్లల్లో విలువలను పెంపొదిస్తాయన్నారు. ఈ నేపథ్యంలో సినిమాలు, సీరియల్స్‌లో లైంగిక వివక్ష – అవమానకరమైన సంభాషణలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైంది.. అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
Next Story