సాయంత్రానికి లేదా రేపటికి డయేరియా నీటి నివేదికలు
x

సాయంత్రానికి లేదా రేపటికి డయేరియా నీటి నివేదికలు

విజయవాడ డయేరియా బాధిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ మళ్లీ శనివారం పర్యటించారు.


రాష్ట్రంలో కలకలం రేపిన విజయవాడ డయేరికు కారణని భావిస్తున్న తాగు నీటి పరీక్షల నివేదికలు ఈ రోజు(శనివారం) సాయంత్రానికి కానీ, రేపు ఆదివారం ఉదయం నాటికి కానీ వస్తాయని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ నగరంలోని న్యూరాజరాజేశ్వరిపేటలో డయేరియాకు అసలు మూలాలపై దృష్టి సారించామని, నీటి నమూల నివేదికలు వచ్చిన వెంటనే ఆ మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇది వరకు ఓ సారి విజయవాడ డయేరియా బాధిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ.. శనివారం మళ్లీ మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్‌ క్యాంప్‌ను మంత్రి నారాయణ పరిశీలించారు. అంతేకాకుండా నూతన ప్రభుత్వ ఆసుపత్రి(న్యూజీజీహెచ్‌)లో వైద్య చికిత్సలు పొందుతున్న బాధితులను కూడా ఆయన పరామర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. డయేరియాకు అసలు కారణాలు ఏంటనే వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. తాగు నీటి ద్వారా డయేరియా సంభవించిందా లేక ఫుడ్‌ పాయిజన్‌ వల్ల డయేరియాకు గురయ్యారా అనేదానిపై ఇంకా స్పష్టత రావలసి ఉందన్నారు. నీటి నమూనాలను ఇప్పటికే పరీక్షల కోసం పంపామన్నారు. ఇది వరకు ఓ సారి నెగివిట్‌ రిపోర్టు వచ్చిందన్నారు. అయినా మరో సారి పరీక్షలు చేయిద్దామనే ఉద్దేశంతో రెండో సారి కూడా నీటి నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపామన్నారు. నివేదికలు వచ్చిన తక్షణమే తగిన విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో బాధిత ప్రాంతాల్లో డ్రింకింగ్‌ వాటర్‌ను మార్చామన్నారు.క్యాన్ల ద్వారా బాధిత ప్రాంతాల ప్రజలకు తాగు నీటిని సరఫరా చేశామన్నారు. ఇప్పటి వరకు 15వేల వాటర్‌ క్యాన్లను సరఫరా చేసినట్లు చెప్పారు. బాధితులు ఇప్పటి వరకు 150 మంది వరకు చికిత్సలు తీసుకొని వారి వారి ఇళ్లకు క్షేమంగానే వెళ్లినట్లు చెప్పారు. డయేరియా వల్ల ఎవరూ చనిపోలేదని, ఇలాంటి వదంతులు నమ్మొద్దని మంత్రి నారాయణ మరోసారి స్పష్టం చేశారు.

Read More
Next Story