
లిక్కర్ స్కాంలో ధనుంజయ్ రెడ్డి, గోవిందప్ప, కృష్ణ మోహన్ రెడ్డికి బెయిల్
మద్యం కుంభకోణంలో కేసులో నిందితులైన ముగ్గురికి బెయిల్ వచ్చింది.
ఏపీ లిక్కర్ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులకు బెయిల్ లభించింది. ఈ కేసులో ఇదో కీలక పరిణామంగా చెప్పవచ్చు. పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డికి బెయిల్ వచ్చిన రోజే వీళ్లకూ రావడం గమనార్హం. మద్యం కుంభకోణంలో కేసులో నిందితులుగా ఉన్న ఏ31-ధనుంజయ రెడ్డి, ఏ32-కృష్ణ మోహన్ రెడ్డి, ఏ-33 బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముగ్గురు నిందితులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరువర్గాల వాదనలు ముగిసినట్లు తెలిపింది. ఈ మేరకు ఇవాళ(శనివారం) ముగ్గురికీ బెయిల్ మంజూరు చేస్తూ.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ షరతులు పూర్తి చేసిన అనంతరం వీళ్లు ఈ రాత్రికి విడుదల అయ్యే అవకాశం ఉంది.
మద్యం కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 13న బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేయగా ఆయన 117 రోజులుగా జైల్లో ఉన్నారు. మే 16న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను సిట్ అరెస్ట్ చేయగా 113 రోజులుగా జైల్లో ఉన్నారు.
అసలేమిటీ స్కాం..
2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన కొత్త లిక్కర్ పాలసీ చుట్టూ భారీ అవినీతి, మోసం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దానిపై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సుమారు 3500 కోట్ల రూపాయల స్కాం జరిగినట్టు సిట్ ప్రకటించింది.
ప్రధాన ఆరోపణలు ఏమిటంటే..
ప్రముఖ మద్యం బ్రాండ్‌లను దుకాణాల నుంచి తొలగించి, తెలియని కొత్త బ్రాండ్‌లను ప్రవేశపెట్టారు. వీటికి రాజకీయంగా సంబంధం ఉన్నవారి లింకులు ఉన్నాయని ఆరోపణ.
సప్లై కంట్రోల్‌లో మార్పు
కంప్యూటరైజ్డ్ “C-Tel” సిస్టమ్‌ను రద్దు చేసి, Offer for Sale (OFS) అనే మాన్యువల్ సిస్టమ్‌ను అమలు చేశారు. దీంతో సరఫరాలో స్వేచ్ఛ, ఫేవర్ కంపెనీలకు లాభం.
నెలనెలా ముడుపులు..
నెలకు ₹50–60 కోట్లు లంచాలు వసూలైనట్లు విచారణలో తేలింది. మొత్తం లాభం సుమారు ₹3,200 నుంచి ₹3,500 కోట్లు.
ప్రతిపక్షం అంచనా ప్రకారం ఇది ₹18,000–₹99,000 కోట్ల వరకు ఉందని ఆరోపిస్తోంది.
లంచాలు క్యాష్, బంగారం రూపంలో తీసుకున్నట్లు SIT నివేదికలు. కొంత డబ్బు బినామీ, హవాలా, షెల్ కంపెనీల ద్వారా తిప్పారని ఆరోపణ.
కీలక వ్యక్తులు
రాజ్ కాసిరెడ్డి – మాజీ సీఎం జగన్‌కు ఐటీ సలహాదారు, ఈ స్కాం ప్రధాన సూత్రధారి అని SIT పేర్కొంది.
కొన్ని YSRCP నేతలు, విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి పేర్లు సాక్షుల వాంగ్మూలంలో వచ్చాయి.
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ PSR అంజనేయులు, కన్సల్టెన్సీ సంస్థ KPMG కూడా పాలసీ మార్పుల్లో పాత్ర పోషించారని చార్జీషీట్‌లో ఉంది.
మాజీ రెవెన్యూ ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అవకతవకలపై హెచ్చరించినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణ.
డబ్బు లావాదేవీలు
Enforcement Directorate (ED) PMLA కింద కేసు నమోదు చేసింది.
సుమారు ₹1,677 కోట్లు 16 కంపెనీలకు కాంట్రాక్టుల రూపంలో లభించగా, ₹10,800 కోట్లకు పైగా సరఫరా జరిగింది.
సుమారు ₹3,500 కోట్లు రియల్ ఎస్టేట్, విదేశీ లావాదేవీలకు మళ్లించినట్లు గుర్తించారు.
రాజకీయ వివాదం & ప్రజా ప్రభావం
కాంగ్రెస్ నేత శర్మిల: ఈ స్కాం వల్ల ప్రజారోగ్యానికి ప్రమాదం, కిడ్నీ సమస్యలు, అనారోగ్యం పెరిగాయని ఆరోపించారు.
ప్రతిపక్షం దీన్ని ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే పెద్దది అని పేర్కొంటోంది.