‘నాకదే అనిపిస్తోంది’.. మదనపల్లె ఘటనపై డీజీపీ
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇది యాక్సిడెంటా లేదా ఇన్సిడెంటా? అన్న అనుమానాలు ప్రతి ఒక్కరి నుంచి వ్యక్తమవుతున్నాయి.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇది యాక్సిడెంటా లేదా ఇన్సిడెంటా? అన్న అనుమానాలు ప్రతి ఒక్కరి నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదే అనుమానాన్ని వ్యక్తపరిచిన సీఎం.. వెంటనే అక్కడకు వెళ్లిన విచారణను వేగవంతం చేసిన త్వరితగతిన అప్‌డేట్ ఇవ్వాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. సీఎం ఆదేశాల మేరకు అక్కడకు చేరుకున్న డీజీపీ.. తాజాగా ఈ ప్రమాదంపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ప్రజల్లో ఉన్న అనుమానాలు మరింత అధికం చేశాయి. మదనపల్లెలో జరిగింది ప్రమాదంలా తనకు అనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాతే తాను ఈ అభిప్రాయానికి వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు.
‘కావాలని చేసినట్లే అనిపిస్తోంది’
‘‘ఆదివారం(జులై 21) రాత్రి సుమారు 11:30 గంటలకు ఆర్డీఓ ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగింది. ఘటన స్థలాన్ని మూడు గంటల పాటు పరిశీలించిన తర్వాత ఇది యాక్సిడెంట్ కాదన్న నిర్ణయానికి వచ్చాం. 22ఏ భూముల రికార్డులు ఉన్న గదిలో మంటలు రాజుకున్నాయి. కీలక దస్త్రాలున్న గదిలోనే ఈ ఘటన జరిగడాన్ని అనుమానిస్తున్నాం. ఘటన సమాచారం ఆర్డీఓకు తెలిసింది. కానీ ఆయన సమాచారన్ని కలెక్టర్‌కు అందించలేదు. ఘటన విషయం తెలుసుకున్న సీఐ కూడా ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానంగా ఉంది. ఈ ఘటనలో రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికరుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ జరగడానికి ఆస్కారమే లేదని విచారణలో తేటతెల్లమయింది. ఒక్కడ ఓల్టేజ్‌లో కూడా తేడాలు రాలేదని అధికారులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని ఫోరెన్సిక్ వాళ్లు చెప్తున్నారు’’ అని తిరుమలరావు వివరించారు.
కిటికీ బయట అగ్గిపుల్లలు
‘‘ఆర్డీఓ కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు దగ్దమయ్యాయి. ఇవన్ీన అనుమాలను మరింత పెంచుతున్నాయి. ఇటీవల సాక్ష్యాలను నాశనం చేసే ఘటనలు కొన్ని జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా దర్యాప్తును పరుగులు పెట్టిస్తున్నాం. ఈ కేసు దర్యాప్తుకు 10 బృందాలు ఏర్పాటు చేశాం. ఈ కేసును సీఐడీకి బదిలీ చేయడంపై మంగళవారం లేదా బుధవారం నిర్ణయం తీసుకుంటాం. ఇది యాక్సిడెంటా లేదా కుట్రేనా అనేది విచారణలో తేలుస్తాం’’ అని వెల్లడించారాయన. ఈ అంశంపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉన్నందున పోలీసు శాఖ కూడా దీనిని చాలా తీవ్రంగా భావిస్తోందని చెప్పారు.
అందుకే ఆలస్యమా!
ఈ నేపథ్యంలోనే మదనపల్లె ఆర్డీఓ కార్యాలయానికి వెనకనే ఫైర్ సర్వీస్ కార్యాలయం ఉంది. కానీ ప్రమాదం జరిగి అన్ని ఫైళ్లు కాలే వరకు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోలేదు. దీంతో అప్పటి వరకు వారికి సమాచారం లేదా లేక మరేమైనా కారణం వల్ల రాలేదా అన్న అనుమానాలకు స్థానికులు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు నూతన సబ్ కలెక్టర్ బాధ్యత తీసుకోవాల్సిందిగా ఫైర్ ప్రమాదం వెనుక అనేక అనుమానాలు గతంలో దేశంలోనే అతిపెద్ద రెవిన్యూ డివిజన్ గా మదనపల్లి అనేక వివాదాస్పద భూములు పై కీలక నిర్ణయాలు గత ఐదేళ్లలో తీసుకున్నారని ఆరోపణలు ఈ నేపథ్యంలోనే కేసుల నుంచి తప్పించుకోవడానికి నిప్పంటించారంటూ ప్రజా సంఘాలు టిడిపి శ్రేణులు అనుమానిస్తున్నాయి.