
తిరుమల మెట్లోత్సవం- 3,500 మందితో భక్తి ప్రవాహం
అలిపిరి నుండి తిరుమల వరకు భక్తి మార్గం – భక్తులతో కిటకిటలాడిన సప్తగిరులు
ఈ సందర్భంగా భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. పూర్వం నుంచి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచివెళ్లి స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు. అలాంటివారి అడుగుజాడలో నడిచి శ్రీవారి కృపకు అందరూ పాత్రులు కావాలని తితిదే మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని ఆయన చెప్పారు.
పూర్వం శ్రీపురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.
శ్రీఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు చెప్పారు. భజన మండళ్ల సభ్యులకు తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక శిక్షణ, దాస సాహిత్యంలో సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు.




