
TIRUMALA || తిరుమల క్యూ లైన్లో కొట్టుకున్న భక్తులు.
శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల ఘర్షణ చెలరేగింది.
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి యాత్రికులు పోటెచ్చారు. దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. క్యూలైన్లో చిన్న పిల్లలతో వస్తున్న మహిళల ను తోటి భక్తులు తోసి వేశారన్న కారణంగా ఒకరిని ఒకరు కొట్టుకున్నారు.
దీంతో అక్కడే ఉన్న అక్కడే ఉన్న విజిలెన్స్, పోలీస్ సిబ్బంది వారిని అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినా భక్తులు వినకుండా ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణ భక్తులకి ఎంత సర్ది చెప్పినా వినకుండా గొడవకు దిగడంతో అధికారులు తలలు పట్టుకున్నారు.
వెంటనే క్యూలైన్ వద్దకి చేరుకున్న విజిలెన్స్ అధికారులు భక్తుల్ని పక్కకు తీసుకెళ్లి సముదాయించి గొడవ సద్దుమణిగేలా చేశారు.
Next Story