ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు
x
ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు

ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు

దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ప్రారంభం


దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు అమ్మవారు పలు రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మెుదటిరోజు సందర్భంగా అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా భక్తులకు కనువిందు చేస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి మెుక్కులు చెల్లించుకుంటున్నారు.
"అమ్మలగన్న అమ్మ, పెన్నుధిలిచ్చెడి లక్ష్మి, పేర్వడ్డ అనాదిశక్తి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా సర్వం శక్తిమయం జగత్ అన్న చందాన అందర్ని రక్షించే అమృతవల్లి. తల్లిలా లాలిస్తుంది. తండ్రిలా పోషిస్తుంది. గురువులా మార్గాన్ని చూపుతుంది. శరణ శరణోయమ్మ, శరణు శరణు అంటే చాలు సమస్త సంపదల్ని ప్రసాదించే దుఃఖ వినాశిని" అని భక్తులు ప్రార్థిస్తుంటారు. అటువంటి దేవీ నవరాత్రులు అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి విజయదశమి వరకు ప్రతి దేవాలయాల్లోనూ, గృహాలలో నిర్వహించే సంప్రదాయం మనది.
ఈ శరన్నవరాత్రులలో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కొక్క అలంకారంతో దర్శించి ఆరాధించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. తొమ్మిది రోజులపాటు అమ్మవారు పలు రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో పదకొండు అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని తొలి రోజున బాలాత్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చే అమ్మవారికి అభయహస్తాలు, బంగారు పూల జడ, కంఠాభరణాలతో అలంకరణ చేశారు.
ఇక మిగతా అలంకాలు..
గాయత్రీ దేవి అలంకారంలో.. స్వర్ణ పంచముఖాలు, బంగారు అభయహస్తాలు, పచ్చల హారం, కంఠాభరణం, శంఖు చక్రాలు, బంగారు కిరీటంతో వేదమాత దర్శనమిస్తుంది.
అన్నపూర్ణాదేవి అలంకారంలో... స్వర్ణపాత్ర, బంగారు త్రిశూలం, అభయహస్తాలతో అలంకరణ చేస్తారు.
కాత్యాయని దేవిగా శార్దూల వాహనంపై కొలువు దీరిన అమ్మవారికి.. అభయ హస్తాలు, స్వర్ణ కిరీటం, పచ్చల హారాలు అలంకరిస్తారు.
మహాలక్ష్మీదేవిగా.. శంఖు, చక్రాలు, గద, అభయహస్తాలు, వడ్డాణం, కర్ణాభరణాలు, ధనరాశులు ప్రసాదించే అమ్మవారిగా తీర్చిదిద్దుతారు.
లలితా త్రిపుర సుందరీ దేవిగా.. స్వర్ణాభరణాలు, బంగారు కిరీటం, కంఠాభరణాలు, అభయ హస్తాలతో అమ్మవారు దర్శన మిస్తారు.
మహాచండీ దేవిగా సింహ వాహనంపై కొలువుదీరిన అమ్మవారిని.. స్వర్ణ ఖడ్గం, కర్ణాభరణాలు, కంఠాభరణాలు, అభయహస్తాలతో అలంకరణ చేస్తారు.
సరస్వతీ దేవిగా హంస వాహనంపై కొలువు దీరిన అమ్మవారు.. బంగారు వీణ, స్వర్ణ హస్తాలు, పగడ హారాలు, వడ్డాణంతో దర్శనమిస్తారు.
దుర్గాదేవిగా శార్దూల వాహనంపై స్వర్ణ కిరీటం, బంగారు త్రిశూలం, సూర్య, చంద్రులు, శంఖుచక్రాలతో అలంకరణ చేస్తారు.
మహిషాసుర మర్దినిదేవిగా సింహవానంపై కొలువు దీరిన అమ్మవారికి.. స్వర్ణఖడ్గం, బంగారు త్రిశూలం, కంఠాభరణాలు, స్వర్ణ కిరీటం, కర్ణాభరణాలతో అమ్మవారికి అలంకరణ చేస్తారు.
రాజరాజేశ్వరి దేవిగా దసరా ఉత్సవాల చివరి రోజున చెరుకుగడ ధరించిన అమ్మవారికి బంగారు పూలజడ, కాసుల పేరు, స్వర్ణాభరణాలు, బంగారు పాదాలు, కర్ణాభరణాలతో ప్రసన్న వదనంతో దర్శనమిస్తారు.
Read More
Next Story