డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అలా అడిగారు.. సీఎం చంద్రబాబు ఇలా ఓకే అన్నారు
x

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అలా అడిగారు.. సీఎం చంద్రబాబు ఇలా ఓకే అన్నారు

ఎన్నికల ముందు నుంచి పవన్‌ కళ్యాణ్‌పై చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక అభిమానం ఉంది. అందుకే ఆయన అడిగింది ఏదీ కాదనడం లేదు.


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పట్ల మరో సారి తన అభిమానాన్ని చాటుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌ నిజాయితీని, నిబద్దతను పొగుడుతూ చంద్రబాబు చేసిన ప్రసంగం సభలో అందరిని ఆకట్టుకుంది.

అసెంబ్లీ మూడో రోజు సమావేశాల్లో గురువారం శాంతి భద్రతలపై స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. సభలోనే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేష్‌ ద్వారా శాంతి భద్రతల సమస్యలను వివరించారు. గత ప్రభుత్వం లా అండ్‌ ఆర్డర్‌ను ఎలా కాలరాసిందో అనే పలు అంశాలను సోదాహరణంగా సభ దృష్టికి తెచ్చారు. ఈ చర్చలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. శాంతి భద్రతల అంశం చాలా కీలకమైనదని, కేవలం పార్టీల నేతలకే కాదు, రాష్ట్రంలోని ఐదు కోట్ల ఆంధ్రుల రక్షణకు సంబంధించిన అంశమని, దీనిపై చర్చించేందుకు ప్రత్యేక సెషన్‌ పెట్టాలని, ఒక రోజు కానీ, రెండు రోజులు కానీ దీనికి కేటాయించి చర్చించాలని సూచించారు. చట్టమంటే భయపడే విధంగా ఉండాలి. కూలంకుశంగా చర్చించి శాంతి భద్రతలను ఎలా కంట్రోల్‌ చేయనున్నాము, ప్రజలకు ఎలా రక్షణ కల్పించాలి, భవిష్యత్‌లో ప్రణాళికలు ఎలా ఉండాలి అంశాలపై ఒక లోతుగా చర్చించి సవివరమైన కంక్లూషన్‌కు రావాలన్నారు. భారత దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ శాంతి భద్రతల పరిరక్షణ అనేది తలమానికంగా ఉండాలని కోరారు. దీని కోసం రెండు సెషన్స్‌ అయిన పెట్టాలని కోరారు. దీనిపై సభా నాయకులు, సీఎం చంద్రబాబు నాయుడు చొరవ చూపాలని సూచించారు.
దీనిపైన వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు పవన్‌ కళ్యాణ్‌ సూచనను గౌరవిస్తూ మరొక సెషన్‌ పెడుతామని, అన్ని అంశాలను సుదీర్ఘంగా చర్చిద్దామని బదులిచ్చారు. దీనిని కొనసాగిస్తూ పవన్‌ కళ్యాణ్‌ నిబద్దత కలిగిన నేతని, తాను తప్పు చేసినా తన మీద యాక్షన్‌ తీసుకోమని సభలో ఆన్‌ రికార్డు చెప్పిన నేత పవన్‌ కళ్యాణ్‌ అని, దీనికి ఆయనను అభినందిస్తున్నట్లు తెలిపారు. అది పవన్‌ కళ్యాణ్‌ సిన్సియారిటీ అని, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా అలానే ఉండాలని, ఎవరూ కూడా లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు తీసుకొని రాకూడదని సూచించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తెలుగు సినీమాల్లో మంచి ప్రజాదరణ కలిగిన హీరోగా పేరు తెచ్చుకున్న పవన్‌ కళ్యాణ్‌ను అనేక ఇబ్బందులకు గురిచేసిందన్నారు. సినీమాల్లో ఎంతో మంది రౌడీలను,విలన్లు చితకొట్టే హీరో పవన్‌ కళ్యాణ్‌ కూడా జగన్‌ హయాంలో సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పడంతో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నవ్వులు ఆపుకోలేక పోయారు. సీఎం చంద్రబాబు కూడా నవ్వులు ఆపుకోలేక పోయారు. దీంతో సభలో నవ్వులు విరబూసాయి. స్పీకర్‌తో పాటు సభ్యులందరూ హాయిగా నవ్వుకున్నారు.
Read More
Next Story