
నాన్నా, నిన్ను చంపేస్తున్నా, అప్పుడే నాకీ ఉద్యోగం వస్తుంది!
ఇంతలో కొడుక్కి దుర్బుద్ధి పుట్టింది. బతకడం చేతకాని ఆ కుమారుడు.. నాన్నా, నువ్వు ఉద్యోగం మానేసి నాకు ఇప్పించమని ఇంట్లో పోరుపెట్టాడు.
కలికాలం కాకపోతే ఇదేంటీ.. ఏమీ ఇవ్వకపోయినా ఎలా ఉండేదో.. అన్నీ ఇచ్చిన తండ్రిని ఓ కుమారుడు.. కడుపు కక్కుర్తి కోసం నిట్టనిలువునా ప్రాణం తీయడమంటే ఇదే కదూ.. ఇంతటి దారుణం ఈ భూమ్మీద కాకపోతే మరెక్కడైనా చూస్తామా.. అదేంటో చదవండి.
రామాచారిది కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తి గ్రామం. 58 ఏళ్లు. చాలా సాదా సీదా కుటుంబం. భార్య విరూపాక్షమ్మ. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు, కొడుకు. ఆ కొడుకు పేరు వీరాస్వామి. ఇతన్ని డిగ్రీ వరకు చదివించాడు. పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేశాడు. ఎవరి బతుకు వాళ్లు బతకమని చెప్పి తాను చేస్తున్న ఆర్టీసీ డ్రైవరు ఉద్యోగం చేస్తూ పొట్టబోసుకుంటున్నారు.
ఇంతలో కొడుక్కి దుర్బుద్ధి పుట్టింది. బతకడం చేతకాని ఆ కుమారుడు.. నాన్నా, నువ్వు ఉద్యోగం మానేసి నాకు ఇప్పించమని ఇంట్లో పోరుపెట్టాడు. ఈ విషయమై తండ్రీకొడుకులిద్దరూ తరచూ ఇంట్లో గొడవ పడుతున్నారు. డిగ్రీ వరకు చదివిన వీరస్వామి కొంతకాలం ప్రైవేట్ ఉద్యోగాలు చేశాడు. ఎక్కడా కుదురుకోలేదు. తర్వాత సొంతవూరుకు చేరి జులాయిగా తిరుగుతున్నాడు. ఇంతలో ఎవరో మీ నాన్న చనిపోతే ఆ ఉద్యోగం తనకు వస్తుందని ఎవరో చెప్పారట.. ఓ రోజు తాగొచ్చి బుధవారం రాత్రి తండ్రితో గొడవకు దిగాడు. మాటా మాటా మీరింది. కొడుకు ముందుగానే ప్లాన్ చేసుకోవడంతో తండ్రిని రోకలి బండతో తలపై కొట్టి ఒకే ఒక దెబ్బలో తండ్రిని పరలోకానికి పంపాడు.
ఇది గమనించిన గ్రామస్తులు కోడుమూరు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. రామాచారి భార్య విరుపాక్షమ్మ కన్నీరు మున్నీరైంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదైంది. దర్యాప్తు చేస్తున్నారు. వీరాస్వామిని కటకటాల వెనక్కి పంపారు.
Next Story