
చెట్టుకూలి మరణించిన మహిళ
మొంథా తుపాను ఎఫెక్ట్, చెట్టు కూలి మహిళ మృతి
బందరుకు 100కిలోమీటర్ల దూరంలో మొంథా తుపాను
మొంథా తుపాను ప్రభావంతో వీస్తున్న ఈదురుగాలులకు ఓ చెట్టు విరిగిపడి ఓ మహిళ మరణించారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మాకనపాలెంలో ఈ ఘటన జరిగింది. ఈ గ్రామంలో చెట్టు కూలి గూడవల్లి వీరవేణి అనే మహిళ మృతి చెందింది. ఈ తుపానులో ఇప్పటి వరకు జరిగిన తొలి ప్రాణనష్టం ఇదే.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలో తీవ్ర తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. బలిఘట్టం రాజరాజేశ్వరి పర్వతంపై గుడిసెల్లో నివసిస్తున్న వారిని అధికారులు తరలించారు. మొత్తం 55 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు. తుపాను దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వలంధర రేవు- సఖినేటిపల్లి మధ్య పంటు సేవలను నిలిపివేశారు. అల్లూరి జిల్లా పాడేరు మండలం నందిగరువులో చెట్టు కూలడంతో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.
విశాఖపట్నం, కాకినాడ ఉప్పాడ, బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఇచ్చిన సమాచారం ప్రకారం పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రతుపాన్ కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో కదిలిన తుపాను ప్రస్తుతానికి మచిలీపట్నంకి 100 కిమీ, కాకినాడకి 180 కిమీ, విశాఖపట్నంకి 270 కిమీ దూరంలో ఉంది.
Next Story

