
విశాఖ కలెక్టర్ పేరుతో సైబర్ నేరగాళ్ల దందా
ఏకంగా ఐఏఎస్ అధికారుల ప్రొఫైల్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.
ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. అసలి వారికి తెలియకుండా వారి పేర్లతో నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వారి ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వాళ్లకు గాలం వేస్తున్నారు. అర్జెంట్‌గా రూ. 10వేలు కావాలంటూ మెస్సేజ్‌లు పంపుతూ అందిన కాడికి తమ ఖాతాలో వేసుకుని ఉడాయిస్తున్నారు. అసలు వ్యక్తులు తేరుకొని చూసేలోగా జరగాల్సిన దందా జరిగి పోతోంది.
ఇలా అనేక మంది సామాన్య ప్రజలు, యువత ఇప్పటికే సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. అయితే తాజాగా సైబర్ నేరగాళ్లు ఏకంగా ఓ కలెక్టర్ ఫ్రొఫైల్‌పైనే గురి పెట్టారు. ఐఏఎస్ అధికారి కావడం, పైగా ఓ జిల్లాకు కలెక్టర్‌గా ఉండటం, ఆయన ఫ్రెండ్స్ లిస్టులో ధనవంతులు ఉంటారు, వారిని సులభంగా మోసం చేయొచ్చు, ఓ కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి డబ్బులు అడిగితే వెనుకా ముందు ఆలోచించకుండా ఇచ్చేస్తారని భావించినట్లు ఉన్నారు సైబర్ నేరగాళ్లు. దీని కోసం వైజాగ్ కలెక్టర్‌గా ఉన్న హరీంద్రప్రసాద్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను హ్యాక్ చేశారు. ఇదే పేరుతో ఓ నకిలీ ఫ్రొఫైల్‌ను క్రియేట్ చేశారు. అందులో కూడా ఎవ్వరికీ అనుమానాలు రాకుండా హరీంద్రప్రసాద్ ఫొటోనే ప్రొఫైల్ పిక్‌గా క్రియేట్ చేశారు. అలా క్రియేట్ చేసి అందులో ఫ్రెండ్స్ లిస్టుకు అర్జెంట్‌గా రూ. 10వేలు కావాలని మెస్సేజ్‌లు పంపడం మొదలెట్టారు.
ఇది కాస్త కలెక్టర్ హరీంద్రప్రసాద్ దృష్టికి వెళ్లింది. ఒక్క సారిగా షాక్‌కు గురైన ఆయన ఇలాంటి వాటికి మోసపోవద్దని, ఈ మెస్సేజ్‌లపై స్పందించొద్దని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. దీంతో పాటుగా ఈ విషయాన్ని సైబర్ సెల్‌కు సమాచారం అందించారు. సాక్షాత్తు కలెక్టర్ ప్రొఫైల్‌నే సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడంçపట్ల పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దర్యాప్తును ప్రారంభించారు. ఈ సంఘటనపట్ల సామాన్య ప్రజలకు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Next Story