
అమరావతిలో కల్చరల్ సెంటర్..పేరు ఆలోచించండి
నిర్దేశిత గడువులోగా క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారును ఆదేశించారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో ఆధునిక కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు త్వరితగతిన భూమిని గుర్తించాలని సూచించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం వివిధ అంశాలను అథారిటీ ఆమోదించింది. అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించిన విషయాలపై సీఆర్డీఏ, ఏడీసీ అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...‘రాజధాని ప్రాంతంలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం అమరావతిలో ఇప్పటికే ఓ వేదికను నిర్మించి ఉంటే బాగుండేది. దీని కోసం అనువైన ప్రాంతాన్ని గుర్తించండి. ఏర్పాటు చేయబోయే కల్చరల్ సెంటర్‌కు ఏ పేరు పెడితే బాగుంటుందో ఆలోచించండి. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా కల్చరల్ సెంటర్ నిర్మాణం చేపట్టాలని సూచించారు.

